కొత్త జిల్లాలపై వైసీపీలో పోరు తీవ్రం-సీఎం వద్దకు పంచాయతీలు-ఏపీ విభజనతో పోల్చిన ఆనం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ సొంత పార్టీలోనే కాకరేపుతోంది. దీన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో విపక్షాలతో కలిసి సొంత పార్టీ నేతలు సైతం ఆందోళనలు చేపడుతుండగా.. తాజాగా సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాజంపేట జిల్లా కోరుతున్న సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి.. రాయచోటి జిల్లాకు వ్యతిరేకంగా నిన్న సీఎంను కలిశారు.
Recommended Video

వైసీపీలో జిల్లాల విభజన కాక
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన చేపట్టిన ఈ విభజనపై సొంత పార్టీలో సైతం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల్ని పణంగా పెట్టి జిల్లాల విభజనను ఆమోదించేందుకు వారు సిద్ధంగా కనిపించడం లేదు. కొత్త జిల్లాలతో తమ రాజకీయ భవిష్యత్తుకు ముప్పు తప్పదనే ఆందోళనలో వారు కనిపిస్తున్నారు. దీంతో చాలా చోట్ల విపక్షాలతో కలిసి ముందడుగు వేసేందుకు సైతం సిద్ధమవుతున్నారు.

సీఎం వద్దకు రాజంపేట పంచాయతీ
చిత్తూరు జిల్లాలో ఉన్న రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటి నియోజకవర్గం వస్తోంది. ఇన్నాళ్లూ కడప జిల్లాలో ఉంటూ రాజంపేట ఎంపీ సీటుకు ఓటేసిన ఇక్కడి ప్రజలకు ఊరటనిస్తూ సీఎం జగన్ రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చారు. దీంతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా మారినా రాజంపేట మాత్రం జిల్లా కేంద్రంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రాజంపేటలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్ధానిక ఎంపీ, సీఎంకు సన్నిహితుడైన మిథున్ రెడ్డితో పాటు ఇతర నేతలు నిన్న సీఎం జగన్ ను కలిసి రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరారు.

నెల్లూరు విభజనపై ఆనం అసంతృప్తి
నెల్లూరు జిల్లాలో చేపట్టిన పునర్విభజన ప్రక్రియపై వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆనం కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేపట్టిన విభజన ఓ నేత ఉసురుతీసిందని, ఇప్పుడు జిల్లాలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాల్ని పొరుగు జిల్లాలో కలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో మరోసారి అలాంటి పరిస్ధితులే నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు వీటిని నెల్లూరులోనే ఉంచేలా పంచాయతీలు, ఎంపీపీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కలెక్టర్ కు ఇచ్చామన్నారు.

మా అభిప్రాయాలు తీసుకోరా ?
జిల్లాల విభజన ప్రక్రియలో స్ధానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకపోవడంపైనా ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న జిల్లాల విభజన ప్రక్రియను స్వాగతిస్తామని, కానీ నెల్లూరు జిల్లాలో స్ధానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు భిన్నంగా జరుగుతున్న చర్యల్ని వ్యతిరేకిస్తామని ఆనం అన్నారు. దీనిపై త్వరలో సీఎం జగన్ ను కలిసి మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరతామన్నారు.

జిల్లాల విభజనను ఏపీ విభజనతో పోల్చిన ఆనం
జిల్లాల విభజన కోసం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జిల్లాల విభజనలో శాస్త్రీయత పాటించకుండా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అధికార పార్టీకి నష్టం జరగక తప్పదని హెచ్చరించారు. అలాగే జగన్ సర్కార్ చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిన ఏపీ రాష్ట్ర విభజనతో ఆయన పోల్చారు. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయిందని ఆనం గుర్తుచేశారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications