జనసేనతో పొత్తు లేకుంటే కష్టమే-టీడీపీ మనోభావం ? పవన్ ను ఓన్ చేసుకునే ప్రయత్నాలు

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి దూరం పెడుతున్నారు. బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా ప్రస్తుతానికి టీడీపికి దూరంగా ఉంటున్నా భవిష్యత్తులో మాత్రం చంద్రబాబుకు దగ్గర కారన్న గ్యారంటీ లేదు. దీంతో టీడీపీ-జనసేన పొత్తుపై ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పొత్తు ఖాయమన్న ప్రచారమే జరుగుతోంది.

చంద్రబాబు రాజకీయం

చంద్రబాబు రాజకీయం

ఏపీలో చంద్రబాబు రాజకీయాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యంగా రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వైసీపీ సర్కార్ పై క్షేత్రస్దాయిలో వ్యతిరేకత పెరుగుతున్న వేళ దాన్ని సొమ్ము చేసుకునేందుకు తాము రంగంలోకి దిగాల్సిందేనని భావిస్తున్న చంద్రబాబు.. తమతో పాటు మిగతా విపక్షాలను కూడా కలుపుకుపోయేందుకు పావులు కదుపుతున్నారు.

ఇందులో భాగంగా ముందుగా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు జనసేన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పవన్ తో పొత్తు కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు ఆయన బహిరంగంగానే చెప్తున్నారు.

పవన్ మనసులో ఏముంది?

పవన్ మనసులో ఏముంది?

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన.. ఇప్పటికిప్పుడు ఆ పార్టీని వీడి టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. క్షేత్రస్ధాయిలో స్ధానికంగా పొత్తులకు ఓకే అయినా రాష్ట్రస్దాయిలో పొత్తు పెట్టుకునేందుకు మాత్రం సంసిద్ధంగా లేదు. దీనికి చాలా కారణాలున్నాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కాదని ఇప్పటికిప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఇద్దరినీ కలిపి టార్గెట్ చేసినా ఆశ్చర్యం లేదనేది జనసేన వర్గాల మాట. అందుకే ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగించాలని భావిస్తున్నారు.

బీజేపీ మూడ్ ను బట్టే పవన్ నిర్ణయం

బీజేపీ మూడ్ ను బట్టే పవన్ నిర్ణయం

ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఇస్తున్న ఆఫర్ ను స్వీకరించే పరిస్దితుల్లో లేరు. అయితే భవిష్యత్తులో బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైతే మాత్రం లెక్కలు మారే అవకాశం ఉన్నందున పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ-టీడీపీ పొత్తు అవకాశాలు లేవని ఒకసారి తేలిపోతే మాత్రం తాను టీడీపీతో కలిసి ముందుకు సాగే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా కాకుండా ఇప్పిటికిప్పుడు బీజేపీని వీడి టీడీపీతో జత కడితే కేంద్రం తమ ఇద్దరినీ కలిపి టార్గెట్ చేయొచ్చనే భయాలు ఉన్నాయి. దీంతో ఇప్పట్లో పొత్తులపై జనసేనాని ఏమీ తేల్చకపోవచ్చని చెప్తున్నారు.

చంద్రబాబు వ్యూహాలివే

చంద్రబాబు వ్యూహాలివే

ప్రస్తుతానికి తమతో పొత్తు కోసం జనసేన నో అంటున్నా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్న చంద్రబాబు అప్పటివరకూ క్షేత్రస్దాయిలో ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ శ్రేణుల్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఇప్పుడు చంద్రబాబు-పవన్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అలాగే వీటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడం లేదు. త్వరలో ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగవచ్చనే అంచనాలు క్షేత్రస్ధాయిలోనూ ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో బీజేపీ కాకపోయినా జనసేనతో జట్టు కట్టగలిగితే వైసీపీని దీటుగా ఎదుర్కోవచ్చనే అంచనాలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+