దమ్ముంటే హైదరాబాద్ రా!: మోడీకి అసద్ (పిక్చర్స్)

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం సవాల్ విసిరారు. తన ప్రభావం దేశంలో ఉందని మోడీ నిజంగానే భావిస్తే హైదరాబాద్ నుండి పోటీ చేసి తనను ఓడించాలని సవాల్ చేశారు. తాము గుజరాత్‌లోను అభ్యర్థులను నిలుపుతామన్నారు.

మోడీ కాకపోయినా తన పైన అద్వానీ అయినా పోటీ చేయవచ్చునన్నారు. గుజరాత్ రాష్ట్రంలోను తాము తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత రాజకీయాల్లోనూ మజ్లిస్ పార్టీ కీలకపాత్ర పోషించనుందన్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన సీమాంధ్రలోని మైనారిటీలు, బీద, బడుగు, బలహీనవర్గాల హక్కుల పరిరక్షణలో మజ్లిస్ వెనక్కి పోయేది లేదన్నారు. పార్టీ 56వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన కార్యాలయం దారుల్‌సలాంలో ఆదివారం ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు.

అసోంలో ఘర్షణలు జరిగితే మజ్లిస్ బాధితుల పక్షాన నిలబడిందన్నారు. అలాగే కర్నూలులోగానీ, అనంతపురంలోగానీ, శ్రీకాకుళంలో గానీ సమస్యలు వస్తే మజ్లిస్ అక్కడికొస్తుందన్నారు. మత ఛాందసవాద బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాడతామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మజ్లిస్ రాజకీయ పార్టీ కాదని, జాతీయ స్థాయిలో మైనారిటీలు, బిసి,ఎస్‌సి, ఎస్టీల హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న వ్యవస్థ అన్నారు.

తెలంగాణలో బిజెపితో పొత్తుపెట్టుకుంటే తెలుగుదేశం ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోతుందన్నారు. హైదరాబాదులో ఎన్నికల్లో పోటీ చేయడానికి బిజెపికి అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. మోడీ, అద్వానీ తదితర బిజెపి అగ్రనేతల్లో ఎవరైనా హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలవాలన్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. హైదరాబాదులో కేవలం అరగంట వర్షం పడితే ఐదారు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, లక్షలాది కుటుంబాలు అంధకారంలోకి వెళ్లాయన్నారు. ఇదేనా తెలంగాణ అంటే అని ప్రశ్నించారు. నీళ్లు, విద్యుత్తు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు.

అభిమానం

అభిమానం

జంట నగరాలతో పాటు తెలంగాణలో నివసించే సీమాంధ్రులకు తమ పార్టీ రక్షణగా ఉంటుందని, ఈ విషయంలో అభద్రత చెందవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

అసదుద్దీన్

అసదుద్దీన్

ఆదివారం ఇక్కడ ఆయన ఎంఐఎం పార్టీ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని రాష్ట్రంలో ఆ పార్టీకి బలం లేదన్నారు.

అక్బర్

అక్బర్

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తగిన అభ్యర్ధులు లేరన్నారు. నరేంద్రమోడీ మాయలో పడి బిజెపి వైపు ఆకర్షితులు కావద్దన్నారు.

మజ్లిస్

మజ్లిస్

నరేంద్ర మోడీకి దమ్ముంటే హైదరాబాద్‌కు వచ్చి పోటీ చేసి గెలవాలన్నారు. దేశంలో లౌకిక శక్తులకే ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఎంఐఎం మొదటి నుంచి లౌకికపార్టీ అని, తాము మతతత్వంతో వ్యవహరించడం లేదన్నారు.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరే ముస్లింల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు.

మజ్లిస్ పార్టీ

మజ్లిస్ పార్టీ

ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ ఉందంటే అది మహానేత వైఎస్ ముస్లింలకు ఇచ్చిన వరం అన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ

భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి, ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం సవాల్ విసిరారు.

కార్యకర్తలు

కార్యకర్తలు

తన ప్రభావం దేశంలో ఉందని మోడీ నిజంగానే భావిస్తే హైదరాబాద్ నుండి పోటీ చేసి తనను ఓడించాలని సవాల్ చేశారు. తాము గుజరాత్‌లోను అభ్యర్థులను నిలుపుతామన్నారు.

పూలవర్షం

పూలవర్షం

మోడీ కాకపోయినా తన పైన అద్వానీ అయినా పోటీ చేయవచ్చునన్నారు. గుజరాత్ రాష్ట్రంలోను తాము తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామని చెప్పారు.

పార్టీ జెండా

పార్టీ జెండా

సీమాంధ్ర ప్రాంత రాజకీయాల్లోనూ మజ్లిస్ పార్టీ కీలకపాత్ర పోషించనుందన్నారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన సీమాంధ్రలోని మైనారిటీలు, బీద, బడుగు, బలహీనవర్గాల హక్కుల పరిరక్షణలో మజ్లిస్ వెనక్కి పోయేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+