Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గోదావరి లో వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా..!!

ఏపీలో గోదావరి కేంద్రంగా రాజకీయం మారుతోంది. కూటమి నేతలు గోదావరిలో మెజార్టీ సీట్లు గెలుచుకోవటం పైనే ఫోకస్ చేసాయి. వైసీపీ సామాజిక సమీకరణాలతో ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఇక..గోదావరిలో సమీకరణాలు మారుతున్నాయి. జనసేన లో సీటు రాని నేతలు వరుసగా వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసారు. కాంగ్రెస్ లో చేరారు.

గోదావరి జిల్లాలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోపలువురికి జగన్ సీటు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సీట్లు నిరాకరించిన వారికి తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ లోని పీ గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వైసీపీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో చిట్టిబాబు వైసీపీ నుంచి 22,207 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి చిట్టిబాబు పోటీ చేసారు. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ది నారాయణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఈ సారి వైసీపీ నుంచి సీటు దక్కలేదు.

P Gannavaram sitting ysrcp mla kondeti chittibabu resign for party joins in congress

ప్రస్తుత ఎన్నికల్లో పీ గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. కూటమి నుంచి జనసేన అభ్యర్దిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన చిట్టిబాబు కాంగ్రెస్ లో చేరటం తో ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 2009 లోకాంగ్రెస్ లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన పాముల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసారు. కొద్ది రోజుల క్రితం రాజేశ్వరి వైసీపీలో చేరారు. గోదావరిలో ప్రతీ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంది. దీంతో..ఇప్పుడు చిట్టిబాబు నిర్ణయంతో పీ గన్నవరం ఫలితం పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+