చిరంజీవి మూడో కన్ను.. వెంకయ్య స్వయంకృషి: ‘పద్మవిభూషణ్’ల కలయిక
హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌కు వీరిద్దరూ ఎంపికైన విషయం తెలిసిందే. భేటీ సందర్భంగా ఒకేరోజు ఇద్దరికీ పద్మవిభూషణ్ వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఆ ప్రత్యేక క్షణాలను మెగాస్టార్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
కాసేపు సరదాగా మాట్లాడుకొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీవి, ఈ పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరూ ఇరువురికి ఉన్న గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

'జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను కాలేజీలో చదువుతున్నా. ఆ సమయంలో వెంకయ్యనాయుడు విద్యార్థి ఉద్యమనేత. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నాం. నాకు ఆయన ఆ రోజు నుంచి తెలుసు' అని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత తాను సినిమాలలోకి వచ్చానని.. ఆయన రాజకీయాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగారయని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. కొద్దికాలం తర్వాత మేమిద్దరం పార్లమెంట్‌లో కొలిగ్స్‌గా ఉన్నాం. అనేక విషయాలు ఆయనను అడిగి తెలుసుకొనేవాడిని. సమాచార విషయంలో ఆయన నాకు స్ఫూర్తి అని చిరంజీవి వెల్లడించారు. వెంకయ్యనాయుడు స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి అని.. ఆయనను
చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
వెంకయ్యనాయుడుతో పాటుగా తనకు కూడా పద్మవిభూషణ్ రావటంతో తన ఆనందం ద్విగిణికృతమయిందన్నారు. ఇద్దరు తెలుగువాళ్లం.. స్నేహితులం. మాకు ఒకేసారి ఒకే అవార్డు రావటం థ్రిల్లింగ్ అనిపించింది. మేమిద్దరం కలుసుకొని జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం' అని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.
Shared some delightful
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024
and very special moments with
Shri. @MVenkaiahNaidu garu!
Being a fellow recipient of the prestigious honour makes the mutually congratulatory meeting extra joyous and memorable !🙏 #PadmaVibhushan pic.twitter.com/q5yF5L2nYO
మరోవైపు, చిరంజీవిపై వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రెండు కళ్లు అయితే- చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు. ఈ అవార్డు రావటానికి అన్ని అర్ఞతలు మీకు ఉన్నాయి. మీరు కష్టపడి ఒకో అడుగు వేసుకుంటూ- ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగారు' అని చిరంజీవిని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. సరైన సమయంలో ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ అని మెగాస్టార్‌ను ప్రశంసించి సత్కరించారు మాజీ ఉప రాష్ట్రపతి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications