వాళ్ళతో సమానంగా చిరంజీవికి పద్మ విభూషణ్.. హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాను: ఆర్జీవీ కాంట్రవర్సీ!!

కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు వివిధ రంగాలకు చెందిన 132 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. ఇందులో 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కగా, ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. వెంకయ్యనాయుడు, పద్మా సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాఠక్, వైజయంతి మాలలకు పద్మవిభూషణ్ గౌరవం దక్కింది.

చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇక చిరంజీవి తనకు అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల మాటలు రావడం లేదని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించటంపై స్పందించారు.

Padma Vibhushan for Chiranjeevi equal to them.. I pretend to be happy: RGV controversy!!

మెగాస్టార్ చిరంజీవి కి తనదైన సెటైరికల్ స్టైల్ లో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమైంది. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలను అవమానించిన రాంగోపాల్ వర్మ తాను చేసిన ట్వీట్ లో తాను ఎప్పుడూ పద్మా సుబ్రహ్మణ్యం గురించి, బిందేశ్వర్ పాఠక్ గురించి వినలేదని పేర్కొన్నారు. అయితే వారిని మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఉంచడం, వారికి కూడా పద్మవిభూషణ్ ప్రకటించడం తనకు నచ్చలేదన్నారు.

అందుకే తాను ఈ అవార్డుతో థ్రిల్ ఫీల్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ చిరంజీవి గారికి ఇలా అయినా సంతోషంగా ఉంది అంటే తాను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తాను అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాం గోపాల్ వర్మ ట్వీట్ చూసిన చిరంజీవి ఫ్యాన్స్ ఆయన పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అత్యున్నత పురస్కారం చిరంజీవికి లభిస్తే ఇలాగేనా స్పందించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వాళ్ళంతా గొప్పవాళ్ళు .. నీకెలా తెలుస్తారు.. నీకు తెలిసేవాళ్ళు వేరే ఉంటారు కదా అంటూ టార్గెట్ చేస్తున్నారు. జీవితంలో ఎప్పుడు సరిగ్గా మాట్లాడటం నీకు రాదు అంటూ ఆయన పైన నిప్పులు చెరుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+