సిగ్గు లేకుండా ఇంకానా: పొన్నాలపై పాల్వాయి ఫైర్

పొన్నాల అసమర్థత వల్లే సభ్యత్వ నమోదు ఇంకా ప్రారంభంకాలేదని పాల్వాయి అన్నారు. కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతుంటే పార్టీ నేతలనే సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబన్నారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో పార్టీపై హైకమాండ్ దృష్టిసారిస్తుందని పాల్వాయి చెప్పారు.
శాసనసభను సమావేశపరచండి
విద్యుత్ సమస్యపై చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ, మండలి సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని షబ్బీర్ ప్రశ్నించారు.
రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యత అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందన్న ఆయన ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో డబ్బు జమకాలేదని మండిపడ్డారు. రైతులకు 7 గంటల విద్యుత్ సరఫరా చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications