కలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Paradise Papers Leak : 714 Indian Names, ప్యారడైజ్ పేపర్స్ లీక్ సంచలనం ?

  అమరావతి/హైదరాబాద్: పాదయాత్ర ప్రారంభం రోజే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్?: చిక్కుల్లో అమితాబ్, ఆ కంపెనీలో పెట్టుబడులపై అనుమానాలు!..

   పారడైజ్ పేపర్లు

  పారడైజ్ పేపర్లు

  ఏడాది క్రితం పనామా పేపర్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా పారడైజ్ పేపర్లు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. పారడైజ్‌లో 714 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ఇందులో జగన్ ఆర్థిక సంబంధాల ప్రస్తావన కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

   జగన్ పేరు ఉందంటూ

  జగన్ పేరు ఉందంటూ

  ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పుడు జగన్ తాజా ఆర్థిక సంబంధాల ప్రస్తావన పారడైజ్ పేపర్లలో ఉందని వార్తలు రావడం కలకలం రేపుతోంది.

   ఐసిఐజె ఇలా బయటపెడుతోంది

  ఐసిఐజె ఇలా బయటపెడుతోంది

  పన్ను ఎగవేత ద్వారా కూడబెట్టిన సొమ్మును దాచుకోవడానికి స్వర్గధామాలుగా భావించే దేశాలు, దీవుల్లో జరుగుతున్న లావాదేవీల రహస్యాలను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం (ఐసిఐజె) బయటపెట్టిన విషయం తెలిసిందే.

   తాజా ఇన్వెస్గిటేషన్ పారడైజ్

  తాజా ఇన్వెస్గిటేషన్ పారడైజ్

  తాజా ఇన్వెస్టిగేషన్‌లో పారడైజ్ పేపర్ల పేరిట ఏకంగా కోటీ 34 లక్షల రికార్డులు బహిర్గతం చేశారు. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కథనం వచ్చిన విషయం తెలిసిందే.

  జగన్ పేరు జాబితాలో ఉందంటే

  జగన్ పేరు జాబితాలో ఉందంటే

  వైయస్ జగన్ ఆర్థిక సంబంధాల ప్రస్తావన ఈ జాబితాలో ఉందంటే ఆయన సంపాదనకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని వార్తలు వచ్చాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A year after the Panama Papers took the world by storm, a new set of 13.4 million records from a corporate and law services provider firm Appleby has put the spotlight back on as many as 714 Indians and corporates who have evaded taxes and hedged funds.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి