• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్.. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు కీలక ప్రకటన..

|

ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి చేరబోతున్నట్లు, ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్లు గత వారంరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జంప్ అయిపోతారనుకున్న ఎమ్మెల్యేల్లో కొందరు.. టీడీపీ మహానాడులో కీలకంగా వ్యవహరించినప్పటికీ పార్టీ మార్పుపై స్పందించకపోవడంతో ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది.

ప్రధానంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద పేర్లు బలంగా వినిపించాయి. అంతలోనే సాంబశివరావు.. తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పార్టీ మార్పుపై ఎట్టకేలకు ఆయనే స్వయంగా ప్రకటన చేశారు..

షాకింగ్: మలద్వారంలో మందు బాటిల్.. నెవర్ బిఫోర్ అంటున్న డాక్టర్లు.. తమిళనాడులో సీన్ ఇది..

కీలక భేటీ..

కీలక భేటీ..

టీడీపీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీకి అనుబంధంగా పనిచేయబోతున్నారంటూ తనపై జరుగుతోన్న ప్రచారంపై పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అధికారికంగా స్పందించారు. ఆదివారం తన నియోజకర్గంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన ఆయన.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, కార్యకర్తల మనోభావాలను, తన భవిష్యత్ కార్యాచరణను మీడియాకు వివరించారు.

వైసీపీలో చేరట్లేదు..

వైసీపీలో చేరట్లేదు..

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం సహా పలువురు కీలక నేతలు ఇదివరకే సీఎం జగన్ ను కలిసి వైసీసీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. అదే క్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాబశివరావు సైతం వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ సమావేశమయ్యారని వార్తలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన సాబశివరావు.. తాను వైసీపీలో చేరబోవడంలేదని, టీడీపీలోనే కొనసాగుతానని కుండబద్దులుకొట్టారు. దీంతో జంపింగ్ ల వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లయింది. పర్చూరు ఎమ్మెల్యే బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా స్పష్టత ఇస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

సంచలన వ్యాఖ్యలు..

సంచలన వ్యాఖ్యలు..

తాను వైసీపీలో చేరబోవడంలేదని క్లారిటీ ఇచ్చే క్రమంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, మీడియాలో అసత్య వార్తలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ పని చేసింది ఏ పార్టీ వాళ్లనేది ఆయన స్పష్టంగా పేర్కొనలేదు. ‘‘నేను టీడీపీని వీడట్లేదు.

వేరే పార్టీతో సంప్రదింపులు జరపలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటారన్న ఉద్దేశ్యంతోనే నేను కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. కానీ నా నిబద్ధతకు ప్రశ్నించే విధంగా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేశారు''అని సాంబశివరావు అన్నారు.

  వైఎస్ జగన్ ఏడాది పాలన... మంచి సీఎం అయ్యారా ?
  పర్చూరు అభివృద్ధి కోసమే..

  పర్చూరు అభివృద్ధి కోసమే..

  పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వడానికి ముందు తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఎమ్మెల్యే సాంబశివరావు ఓ బహిరంగ ప్రకటన చేశారు. పర్చూరు నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, రైతులు, పేదలకు సేవ చేయడమే తన అభిమతమని, తన భిష్యత్తుపై నియోజకవర్గ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు.

  గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేశారని, భవిష్యత్తుపై ఆయన ఇచ్చిన భరోసాతోనే వైసీపీలోకి చేరాలనుకున్న ఎమ్మెల్యేలు కాస్తా వెనక్కి తగ్గారని, దీంతో తాత్కాలికంగానైనా జంపింగ్స్ ఆగినట్లయిందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది..

  English summary
  iam not going to join in YSRCP, will continue in tdp, says Parchur MLA Yeluri Sambasiva Rao. after huge speculations the tdp mla gave clarity on sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more