మాకు కొత్త కాదు: పరిటాల సునీత, ఇందులోను: శిద్దా

Paritala Sunitha first time in Anantha after taking oath
హైదరాబాద్/అనంతపురం: పరిటాల రవి పైన ఉన్న అభిమానమే తమకు శ్రీరామరక్ష అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆదివారం అన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి అఏభిమానీ, కార్యకర్తను ప్రాణం పెట్టి కాపాడుకుంటామన్నారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడం పరిటాల కుటుంబానికి కొత్త కాదని.. అయితే రాష్ట్రంలో పేదలైన ఆంధ్రుల ఆకలి తీర్చేందుకు కృషి చేయడం నిజంగా అదృష్టమన్నారు.

ఆ భాగ్యాన్ని ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు కల్పించారన్నారు. ఆయన నమ్మకాన్ని తాను నిలబెడుతూనే పేదవాడికి పట్టెడన్నం దక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. పేదల సంక్షేమంలో పౌరసరఫరాల వ్యవస్థ పారదర్శకంగా పని చేసేలా చూస్తానని చెప్పారు. ఆమె మంత్రిగా అయ్యాక మొదటిసారి అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ ఉన్నత ప్రమాణాలతో నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే రాజధానిని నిర్మిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉందని, 15 వేల కోట్ల రూపాయలకు పైగా లోటు బడ్జెట్ ఉందన్నారు. ప్రజల సహకారంతో తాము అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు.

ఇందులోను అన్యాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు క్వార్టర్ల కేటాయింపులోను అన్యాయం జరిగిందని ఎపి రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవ రావు హైదరాబాదులో అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, చివరకు క్వార్టర్ల కేటాయింపులోను అన్యాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+