Pastor Praveen: వీడిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ- పోలీసుల సంచలన ప్రకటన..!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మిస్టరీ వీడిపోయింది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏపీకి వస్తూ రాజమండ్రికి సమీపంలో రోడ్డు పక్కన విగతజీవిగా తేలిన పాస్టర్ ప్రవీణ్ మృతిని తొలుత రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అయితే కుటుంబ సభ్యుల అనుమానాలతో ఆ తర్వాత దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి వివరాలు ప్రకటించారు.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజమండ్రిలో ఇవాళ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడింంచారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామని, ఆయన దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని గుర్తించినట్లు తెలిపారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామన్నారు. ప్రవీణ్ కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ అశోక్ తెలిపారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబసభ్యులు చెప్పారన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడినవారు ఎలాంటి ఆధారాలూ ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే అని తేల్చేశారు. దారిలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారన్నారు.
దారిలో ప్రవీణ్ కు మూడుసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ఆయన వెల్లడించారు. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందన్నారు. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారన్నారు. కీసర వద్ద ప్రవీణ్ కు సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారని తెలిపారు. గుంటుపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారని, బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయిందన్నారు.
విజయవాడ రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ ను ఆటోడ్రైవర్ చూశారని, ట్రాఫిక్ ఎస్ఐ సూచనతో పార్కులో రెండు గంటలు నిద్రపోయారని తెలిపారు. కండిషన్ బాగాలేదు, వెళ్లవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారన్నారు. హెడ్ లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారన్నారు. ఏలూరులో మూడోసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారన్నారు. మద్యం షాపునకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్లజోడు పగిలిపోయిందన్నారు.
కొంతమూరు పైవంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారని, ప్రమాదస్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయిందని పోలీసులు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ ను ఏ వాహనం కూడా ఢీకొనలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ కు, పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉందన్నారు. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి.. కంకర రాళ్లు ఉన్నాయన్నారు.బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పిందన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బండి ఫోర్త్ గేర్ లో ఉందని చెప్పారని, ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారని పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో ఆరుసార్లు యూపీఐ పేమెంట్లు చేశారని, ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications