పవన్ కళ్యాణ్ దారిలో 'అమెరికా' ఫ్యాన్స్: వెంకటరమణ ఫ్యామిలికీ రూ.5 లక్షలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు దాతృత్వాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖాజలూరు మండలం కుయ్యూరుకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి అమెరికాలోని అభిమానులు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు దాతృత్వాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఖాజలూరు మండలం కుయ్యూరుకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త కుటుంబానికి అమెరికాలోని అభిమానులు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల చేతుల మీదుగా జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. సెప్టెంబర్ 11న కాకినాడలో జరిగిన సీమాంధ్ర ఆత్మ గౌరవ సభలో వెంకటరమణ అనే కార్యకర్త ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. వెంకటరమణ కుటుంబానికి పవన్ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అభిమానులు కూడా ఇప్పుడు స్పందించారు.
కాగా, ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ వరుసగా బహిరంగ సభలు పెడుతున్న విషయం తెలిసిందే. తొలి సభను చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏర్పాటు చేశారు. అనంతరం కాకినాడలో రెండో సభను పెట్టారు. మూడో సభను డిసెంబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో పెట్టారు.












Click it and Unblock the Notifications