వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కూడా బద్దశత్రువు కాదు: పవన్ కళ్యాణ్ అమ్మవారి దీక్ష, గోదావరి ఒడిలో ప్రయాణం

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దసరా నవరాత్రుల పర్వదినం సందర్భంగా అమ్మవారి దీక్షను చేపట్టనున్నారు. దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్న ఈ నెల 10వ తేదీ ఉదయం ఆయన అమ్మవారికి పూజ చేస్తారు. అనంతరం అమ్మవారి దీక్షను ప్రారంభిస్తారు.

తొమ్మిది రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలో ఉంటారు. ఈ దీక్ష సమయంలో పండ్లు, పాలు మాత్రమే ఆయన ఆహారంగా తీసుకుంటారు. ఆదివారం ఆయన పోలవరంలో పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో పవన్ ప్రతి ఏడాది చాతుర్మాస దీక్ష చేసేవారు. ఇప్పుడు అమ్మవారి దీక్ష చేయనున్నట్లు తెలిపారు.

జనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదనజనసేనలో నాకూ అధికారంలేదు, బాధ్యతలు అప్పగిస్తే అలాగా, మీదే తప్పు: పవన్ ఆవేదన

పాలకులు చేసే తప్పులకు ప్రజలు ఇబ్బంది పడాలా?

పాలకులు చేసే తప్పులకు ప్రజలు ఇబ్బంది పడాలా?


కాగా, ఆదివారం ఆయన పోలవరం నిర్వాసితులతో భేటీ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు. ఈ సందర్భాలలో ప్రభుత్వంపై జనసేనాని నిప్పులు చెరిగారు. నాయకులు చేసే తప్పులకు ప్రజలు ఇబ్బంది పడాలని టీడీపీపై నిప్పులు చెరిగారు. తాను ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. పార్టీలో చేరేవారిలో ప్రజలను కలుపుకొని వెళ్లే వారి శక్తిని మాత్రమే చూస్తానని, ఆర్థిక బలాన్ని చూడనని చెప్పారు. పార్టీలో చేరే వారి ఆర్థిక బలాన్ని తాను చూడటం లేదని, వారు ప్రజల్లో ఎలా కలిసిపోతారు, ప్రజలను కలుపుకుపోయే శక్తి ఎంత ఉందనేది మాత్రమే చూస్తానని చెప్పారు. జన్మభూమి కమిటీతో పంచాయతీ వ్యవస్థను చంపేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వర్‌లు ఆదివారం జనసేనలో చేరారు.

అప్పటి వరకు జనసేన పోరాడుతుంది

పోలవరం భూనిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికి ఆ చట్టం ప్రకారం పరిహారం అందే వరకు జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు పరిహారం విషయంలో న్యాయం చేయలేదని, 2016లో గ్రామాలు ఖాళీ చేయించారన్న విషయాన్ని పలువురు బాధితులు జనసేనానికి తెలిపారు. పరిహారం విషయంలోను, కుటుంబ ప్యాకేజీ విషయంలోను తమకు అన్యాయం జరిగిందని బాధితులు తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు.

గోదావరి ఒడిలో జనసేనాని పడవ ప్రయాణం

2013 భూసేకరణ చట్టంపై తనకు పూర్తి అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలవరం ముంపు బాధితులకు న్యాయం జరగాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన పూర్తయ్యే లోపు పోలవరం ముంపు గ్రామమైన వేలేరుపాడు గ్రామాన్ని సందర్శిస్తానని చెప్పారు. పోలవరం నిర్వాసితులను పరామర్శించిన పవన్ కళ్యాణ్ గోదావరి నదిలో పడవ ప్రయాణం కూడా చేశారు.

జగన్ కూడా బద్ధ శత్రువు కాదు, అమ్మ పింఛన్ నుంచి విరాళం

ప్రజా సేవ చేసే వారే రాజకీయాల్లోకి రావాలని పవన్ అన్నారు. రాజకీయాల్లో తనకు ఎవరూ శత్రువులు లేరని చెప్పారు. జగన్ కూడా బద్ద శత్రువు కాదన్నారు. కాటన్ ఆనాడు ఉభయ గోదావరి జిల్లాల కరువును దృష్టిలో పెట్టుకొని ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, ప్రస్తుతం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఆదివాసీల సమస్యలు దగ్గర నుంచి చూశానని గుర్తు చేసుకున్నారు. అయిదేళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పని చేసే వారికి జీవితకాలం పింఛన్ ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి పని చేసే ఉద్యోగులు చేసుకున్న అన్యాయం ఏమిటన్నారు. కానిస్టేబుల్ కొడుకుగా తనకు ఉద్యోగుల సమస్యలు తెలుసునని చెప్పారు. తన పుట్టిన రోజున అమ్మకు వచ్చే పింఛను నుంచి లక్ష రూపాయలను జనసేనకు విరాళంగా ఇచ్చారని చెప్పారు.

Recommended Video

టిడిపి ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చతురులు

English summary
Jana Sena chief Pawan Kalyan ammavari deeksha from October 10 for nine days on Dasara days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X