చంద్రబాబుకు పవన్ ఎలివేషన్ వెనుక లోకేష్? బిగ్ స్కెచ్ కు బిగ్ చెక్..?

ఏపీలో గతేడాది చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుతో జట్టు కట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో కూటమిని ఘన విజయం దిశగా నడిపించడంతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకమయ్యారు. అనంతరం కూడా ప్రభుత్వంలోనూ డిప్యూటీ సీఎం హోదాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ అధికార కూటమితో పాటు విపక్షాల్ని కూడా ఆలోచనలో పడేసింది. దీని వెనుక రాష్ట్ర అధికార కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఎవరు అవునన్నా, కాదన్నా సీఎం చంద్రబాబు కంటే ఆయన కుమారుడు నారా లోకేష్ దూకుడు కనిపిస్తోంది. కేబినెట్లో ఇంత మంది మంత్రులున్నా వారికి అనధికార రిపోర్టింగ్ పాయింట్ లోకేషే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో లోకేష్ కు తెలియకుండా ఏదీ జరిగే పరిస్దితి లేదు. ప్రతీ నియామకం, ప్రతీ బదిలీ, ప్రతీ నిర్ణయం, ప్రతీ వ్యూహంలోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ దూకుడే పవన్ ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.

pawan kalyan s big checkmate to nara Lokesh s big plan via chandrababu- here is how

కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ ఎంత కీలకంగా ఉన్నా ఆయన పార్టీ జనసేన పోటీ చేసిన, గెలిచిన స్దానాలు 21 మాత్రమే. మరోవైపు 134 సీట్లు గెల్చుకున్న టీడీపీ ఇప్పుడు పవన్ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐదేళ్ల ప్రభుత్వం నడుపుకునే పరిస్దితుల్లో ఉంది. ఇలాంటి స్ధితిలో లోకేష్ దూకుడు పవన్ కు సహజంగానే కలవరంగా మారుతోంది. అంతే కాదు ఈ ఐదేళ్లలోపు లేకపోతే ఐదేళ్లు పూర్తి చేసి చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవడమో, లేక కనీసం సీఎం పదవి నుంచి తప్పుకుని లోకేష్ కు ఆ బాధ్యత అప్పజెప్పవచ్చనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ సీఎం అయ్యే అవకాశాలు నానాటికీ మెరుగుపడుతున్నట్లే.

దీంతో చంద్రబాబు కాకపోతే తానే సీఎంగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా అసెంబ్లీలో మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎం అన్న మాటను నేరుగానే చెప్పేశారు. మరో పదేళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారు, ఇంకెవరీ ఒప్పుకునేది లేదన్న సంకేతం ఆయన మాటల్లో కనిపించింది. దీంతో ఇప్పుడు లోకేష్ దూకుడుకు చెక్ పెట్టేందుకే పవన్ ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న చర్చ మొదలైంది. ప్రస్తుతానికి అలా లోకేష్ వ్యూహాలకు పవన్ చెక్ పెట్టినా అంతిమంగా చంద్రబాబు స్వయంగా కోరుకుంటే మాత్రం లోకేష్ సీఎం పదవికి పవన్ అడ్డంకులు సాధ్యం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+