అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భయంలేదు: పవన్ 'ఇంగ్లీష్'తో ఇరకాటంలో బాబు-జగన్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై కేంద్రంపై నిప్పులు చెరిగారు. అంతేకాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే తనకు భయం లేదని, తాను ఇంగ్లీష్‌లో కేంద్రాన్ని నిలదీస్తున్నానని చెప్పి సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ని ఇరకాటంలో పెట్టారు.

చదవండి: బీజేపీ-జగన్ లింకుపై బాబు, అంతలోనే: టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి షాక్, వైసీపీ ఎంపీతో భేటీ!

ఢిల్లీలో బీజేపీతో బాగుంటారని, ఇక్కడకు వచ్చి నిరసనలు చేస్తారని, తెలుగులో తిడతారని, కేంద్రానికి అర్థం కాకుండా విమర్శిస్తారని ఇటు టీడీపీ, అటు వైసీపీ పలుమార్లు పరస్పరం మాటల దాడి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు ఇంగ్లీష్‌లో మాట్లాడితే బీజేపీ పెద్దలకు అర్థమవుతుందని మాట్లాడరని, తెలుగులో విమర్శించి, ఇంగ్లీష్‌లో మెచ్చుకుంటారని కూడా టీడీపీ, వైసీపీల మధ్య వాగ్వాదం జరిగాయి.

చదవండి: ఇక 2019 అంత సులభం కాదు: నాలుగేళ్ల తర్వాత.. బాబుకు పవన్ భారీ షాక్, ఒక్కో పాయింట్‌తో ఇలా

జగన్, చంద్రబాబులకు అల్టిమేటం

జగన్, చంద్రబాబులకు అల్టిమేటం

ఇప్పుడు, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్‌లో జైట్లీ, బీజేపీ దుమ్ముదులిపి చంద్రబాబు, జగన్‌లను ఇరకాటంలో పెట్టారని అంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను నిలదీసేందుకు తనకు భయం లేదన్నారు. చంద్రబాబు, జగన్‌లా భయపడేందుకు తాను తప్పులు చేయలేదని, భయపడేది లేదని పరోక్షంగా అన్నారు. తద్వారా హోదాపై వారు కూడా గొంతు విప్పాలన్నారు. లేదంటే కేసుల భయంతోనే మాట్లాడటం లేదని అభిప్రాయపడ్డారు.

నాకు భయం లేదు మరి మీకు

నాకు భయం లేదు మరి మీకు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అర్థమయ్యేందుకే తాను ఢిల్లీలో మాట్లాడుతున్నానని పవన్ మొదటే చెప్పారు. మన వాళ్లకు కేంద్రం అంటే పిరికితనమని, దోపిడీ చేసేవాళ్లకు, తప్పులు చేసేవాళ్లకు పిరికితనం, భయం ఉంటుందని, తనకు అలాంటి భయం లేదని తేల్చి చెప్పారు. టంగుటూరి వారసులం మనకు భయమెక్కడిది అన్నారు. బాబు, జగన్‌లకు వాళ్ల భయాలు వారికి ఉంటాయని, పాతిక మంది ఎంపీలతో 5 కోట్ల మందిని కంట్రోల్ చేస్తారా అని నిలదీశారు. హోదా డబ్బు సమస్య కాదని, మా ఆత్మగౌరవ సమస్య అన్నారు. అంతేకాదు, చట్టాలను మీరు గౌరవించనప్పుడు, మీరు గౌరవించని చట్టాలను మేం ఎందుకు గౌరవించాలని కేంద్రాన్ని నిలదీశారు.

కేంద్రానికి నిలదీత

కేంద్రానికి నిలదీత

నా పేరు పవన్ కళ్యాణ్, అమరావతి నుంచి మాట్లాడుతున్నా అంటూ జైట్లీని నిలదీశారు. నాలుగేళ్ల నుంచి ఏపీకి జరుగుతున్న అన్యాయం తమను బాధపెట్టిందని, మీ ప్రకటన మా గుండెల్ని పిండేసిందని, మీ కాకినాడ ప్రకటనకు అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించారని, విభజనతో ఏపీకి న్యాయం జరగలేదని, మరి ఇచ్చిన మాట ప్రకారం హోదా ఇవ్వలేదన్నారు. సెంటిమెంటుతో హోదా ఇవ్వమని జైట్లీ చెప్పారని, మరి తెలంగాణ ఇచ్చారుగా అని ప్రశ్నించారు. 15 ఏళ్ల పాటు హోదా అని ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు.

వివేకానందుడు పుట్టిన భూమి

వివేకానందుడు పుట్టిన భూమి

తమకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భయం లేదని, ఎందుకంటే ఇది స్వామి వివేకానంద పుట్టిన భూమి అని పవన్ కళ్యాణ్ అన్నారు. రైల్వే జోన్ వచ్చేదాకా వదిలేది లేదని పవన్ చెప్పారు. తన పార్టీ బిల్డప్ కాలేదని చెబుతున్నారని, మీరంతా ఏమిటని, వారికి కనిపించకుంటే నేనేం చేయాలన్నారు. పంచాయతీ, కార్పోరేషన్ తదితర ఎన్నికలు వస్తున్నాయని గుర్తు చేశారు. మన రాష్ట్రాన్ని మనం కాకుంటే ఇంకెవరు చూసుకుంటున్నారు. చివరగా.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను నిలదీయలేరని, కనీసం టీవీల్లో విమర్శించలేరని పవన్ అన్నారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదన్నారు.

టీడీపీతో దోస్తీ కట్టనని తేల్చేశారు

టీడీపీతో దోస్తీ కట్టనని తేల్చేశారు

ఈ సభ ద్వారా పవన్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో దోస్తీ కట్టనని తేల్చి చెప్పారు. ఎదురు తిరుగుతానని, రైతు సమస్యలపై పనిచేయాలని తనకు చెబితే కూలీలా పనిచేసేవాడినని, ఎన్డీయే, తెలుగుదేశం ప్రభుత్వాలను అడిగి నేను కాంట్రాక్టులు ఇప్పించలేనని, ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే ఓటుకు నోటు కేసులో తగ్గి మాట్లాడానని, ఎర్రచందనం స్మగ్లర్లపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

English summary
Jana Sena Party chief, Pawan Kalyan made a scathing attack on Union Finance Minister, Arun Jaitley. He attacked him in English, over his recent statements that Special Category Status cannot be given to Andhra Pradesh just because of sentiment. Pawan lashed out at Jaitley, albeit giving him due respect as a Union minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X