పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి: ఇప్పుడు రాష్ట్రానికి నువ్వు కావాలి: సోషల్ మీడియాలో రచ్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో అధికారం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులతో ముందుకు వెళుతుండగా, వైసిపి మాత్రం తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. అయితే ఇదే క్రమంలో జనసేన టిడిపి పొత్తుల పైన ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Recommended Video

జనసేన, టిడిపి పొత్తులతో వెళితే ఏపీలో సీఎం ఎవరు అన్న చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలన్న ఆకాంక్ష జన సైనికులలో, పవన్ కళ్యాణ్ అభిమానులలో బలంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటీవల లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు గారే పూర్తి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైన జనసేన సోషల్ మీడియాలో తమ ఆకాంక్షను తెలియజేస్తూ రచ్చ మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని జనసేన పార్టీ పేర్కొంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రాష్ట్రానికి నువ్వు కావాలి అని ప్రచారం చేస్తున్న జనసేన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సీఎం అంటూ డీపీలతో హల్చల్ మొదలు పెట్టింది.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని జనసైనికుల కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే టిడిపి జనసేన పొత్తులతో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని డిమాండ్ ను వినిపిస్తున్నారు.

ఇక టీడీపీకి, జనసేనకి ఎలాంటి అవకాశం ఇవ్వబోమని, మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు జగనే కావాలి అంటారని వైసిపి నేతలు చెబుతున్నారు. ఇక ఇదంతా చూస్తున్న వారు ఆలు లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ముందు ఎన్నికల్లో గెలిస్తేనే కదా ఆపై సీఎం ఎవరు అనేది నిర్ణయించేది అని అని చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications