వారిని గురిచూసి పాతాళానికి తొక్కేసిన చిరంజీవి, పవన్ కల్యాణ్?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా హీరోలంటే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్.. ప్రస్తుతానికి చిరు కుటుంబం నుంచి 9 మంది కథానాయకులుగా కొనసాగుతున్నారు. నలుగురు హీరోలు స్టార్ హీరోలే కాబట్టి వారు గురిచూసి కొడితే బాక్సాఫీస్ బద్దలే. అయితే ఈ సీజన్ మెగా హీరోలకు కలిసిరావడంలేదు.
పవన్ కల్యాణ్ సినిమా బ్రోతో మొదలుపెడితే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో పూర్తిచేయగా, మధ్యలో చిరంజీవి భోళాశంకర్ ఉంది. ఈ సినిమాలతో నిర్మాతలు పూర్తిగా పాతాళంలోకి పోయారు. బ్రో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన భోళాశంకర్ పరిస్థితి మరీ దారుణం. మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది.

ట్రోలర్స్ కు మెహర్ రమేష్ మంచి ముడిసరకును అందించాడు. చిరంజీవిమీద కూడా ఎక్కువ విమర్శలు వచ్చాయి. వయసుకు తగిన పాత్రలు ఎంచుకోవాలని, కుర్రాళ్లలా కనిపించడం తగ్గించుకోవాలని అందరూ హితవు పలికారు. తాను చేయబోయే సినిమాల విషయంలో పునరాలోచన పడటంతోపాటు నిర్మాతకు కొంత సొమ్మును చిరు వెనక్కి ఇచ్చేశాడు.
ఇప్పుడు గాండీవధారి అర్జున వంతు. వరుణ్ తేజ్-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చింది. యాక్షన్ డ్రామాగా వచ్చి బోల్తా కొట్టింది. రూ.50కోట్ల ఖర్చుతో నిర్మించారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. నాన్ థియేటరికల్ రైట్స్ మినహాయిస్తే కనీసం రూ.5 కోట్లు కూడా థియేటర్ల నుంచి రాని పరిస్థితి. ఇది మరో భారీ డిజాస్టర్. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం ఒక్కటే మెగా హీరోలకు ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications