Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోటీ చేసే నియోజకవర్గం ప్రకటించిన పవన్ కల్యాణ్ - సహకరించండి..!!

జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానం పైన స్పష్టత ఇచ్చారు. కొంత కాలంగా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరంతో పాటుగా గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఈ సారి పవన్ గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఈ సమయంలో పవన్ తన పోటీ పైన స్వయంగా స్పష్టత ఇచ్చారు.

భీమవరం నుంచి పవన్ పోటీ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం పైన ప్రకటన చేసారు. 2019 ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేసి అక్కడే గెలవాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

Pawan Kalyan Confirms his contest in next elections from Bhimavaram as he defeated in 2019

గత ఎన్నికల్లో పవన్ కు భీమవరంలో 62,285 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులుకు 54,037 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్ది గ్రంధి శ్రీనివాస్ కు 70,642 ఓట్లు రాగా.. ఆయన 8,357 ఓట్లతో విజయం సాధించారు. ఈ సారి టీడీపీ మద్దతుతో పోటీ చేయటం ద్వారా పవన్ గెలిచి అసెంబ్లీలో భీమవరం నుంచే అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు.

ఓడిన చోటే గెలిచేలా: ఈ సారి భీమవరం నుంచి వైసీపీ అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను సీఎం జగన్ ఖరారు చేసారు. భీమవరం సభలో ఈ సారి రీల్ స్టార్ పైన రియల్ స్టార్ ను బరిలోకి దిగుతున్నారని జగన్ ప్రకటించారు. గతంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయటం తో వైసీపీ గెలిచిందనే లెక్కలు జనసేన నేతలు చెబుతున్నారు.

ఈ సారి టీడీపీ, జనసేన కలవటం ద్వారా పవన్ గెలుపు ఖాయమని విశ్లేషిస్తున్నారు. అయితే, పవన్ పైన విజయం ఈ సారి వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. భీమవరం వచ్చిన పవన్ కల్యాణ్ తాజాగా జిల్లా టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు స్పష్టత ఇచ్చిన ఆయన..టీడీపీ నేతలు సహకరించాలని కోరారు. జిల్లా నేతలు తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Pawan Kalyan Confirms his contest in next elections from Bhimavaram as he defeated in 2019

ఢిల్లీలో కీలక నేతలతో భేటీ: ఇప్పటికే పవన్ భీమవరం అసెంబ్లీ పరిధిలోనే ఇంటిని తీసుకుంటున్నారు. అక్కడే మకాం ఉంటానని ప్రకటించేందుకు సిద్దమయ్యారు. భీమవరం నుంచి పోటీ చేయటం ద్వారా గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. రెండో స్థానంగా రాయలసీమ నుంచి తిరుపతి అసెంబ్లీ బరిలో ఉంటారని సమాచారం.

దీని పైన ఇంకా పవన్ స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో పొత్తుల అంశం ఖరారు చేసేందుకు పవన్ ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల వ్యవహారం పైన చర్చించి పొత్తును ఖాయం చేయనున్నారు. ఆ తరువాత చంద్రబాబు, పవన్ బీజేపీ నేతలో భేటీ అవుతారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే పొత్తు, సీట్ల పైన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+