వైసీపీకి అనుకూలంగా పవన్ నిర్ణయం : ఇరకాటంలో బీజేపీ - టీడీపీ : చంద్రబాబు వెనుకడుగు వేస్తారా..!!

ఏపీలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ ను కార్నర్ చేస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కొత్త చర్చకు కారణమైంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక మొదలు...రాజమండ్రి-అనంతపురం శ్రమదానం..సభల వరకు పవన్ వైసీపీ పైన విరుచుకుపడ్డారు. సవాళ్లు చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 15 సీట్లకే పరిమితమని చెప్పుకొచ్చారు. యుద్దం మొదలైందంటూనే .. దేనికైనా సిద్దం..తేల్చుకోవాల్సింది వైసీపీనే అంటూ అల్టిమేటం జారీ చేసారు. పవన్ ఈ తరహాలో వైసీపీ పైన విరుచకుపడుతుండటం బీజేపీ-టీడీపీ తమకు కలిసొచ్చే అంశాలుగా భావించాయి.

పవన్ నిర్ణయం వైసీపీకి అనుకూలం

పవన్ నిర్ణయం వైసీపీకి అనుకూలం

టీడీపీ ఎక్కడా పవన్ వర్సస్ జగన్ వివాదంలో జోక్యం చేసుకోకుండా... మద్దతిచ్చి..ఇవ్వనట్లుగా పవన్ కు అండగా నిలబడింది. ఇదే సమయంలో పవన్ సైతం తన ప్రసంగాల్లో ఎక్కడా టీడీపీని తప్పు బట్టలేదు. రాజమండ్రిలో మాత్రం అసలు విషయం చెప్పేసారు. వైసీపీని ఎదుర్కోవటానికి టీడీపీ సమర్ధత సరిపోవటం లేదని..అందుకే తాను రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. ఇక, అనంతపురం లో పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు బీజేపీ- టీడీపీకి సమస్యగా మారింది.

బీజేపీ- టీడీపీకి ఇరకాటం

బీజేపీ- టీడీపీకి ఇరకాటం

బద్వేలులో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక రావటం...ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వటంతో తాము పోటీ చేయబోమని జనసేన అధినేత ప్రకటించారు. వైసీపీతో తాము పోరాడుతున్నా...విలువలు కాపాడేందుకు ఈ ఎన్నిక నుంచి మాత్రం తప్పుకుంటున్నామని స్పష్టం చేసారు. అయితే, మిత్రపక్షం బీజేపీకి ఇది ఇబ్బందిగా మారింది. పార్టీ అధినాయకత్వం గెలుస్తామా లేదా అనే దాని కంటే ముందు పోటీలో ఉండాలని స్పష్టం చేసింది.

పోటీకే బిజేపీ సిద్దం..నేడు నిర్ణయం

పోటీకే బిజేపీ సిద్దం..నేడు నిర్ణయం

దీంతో..జిల్లాకు చెందిన నేతలు సీఎం రమేష్..ఆదినారాయణ రెడ్డి బద్వేలు అభ్యర్ధి ఎంపిక పైన మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే జనసేన-బీజేపీ మధ్య పలు విషయాల్లో విబేధాలు కనిపించాయి. తాజాగా పోటీ చేయట్లేదని జనసేన చెప్పగా.. సమస్యే లేదని కచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నట్లుగా బీజేపీ చెప్పడం జనసేనకు రుచించటం లేదు. అయితే, బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టినా..జనసేన మద్దతు..అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అవకాశాలు మాత్రం లేవనేది స్పష్టంగా తెలుస్తోంది.

టీడీపీ నిర్ణయం మార్చుకుంటుందా

టీడీపీ నిర్ణయం మార్చుకుంటుందా

అయినా..బీజేపీ మాత్రం పోటీలో ఉండటానికే మొగ్గు చూపుతోంది. ఈ రోజున కడప జిల్లాలో జరిగే సమావేశంలో అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక, పవన్ నిర్ణయం టీడీపీకి ఇబ్బందిగా మారింది. విలువల కోసం మరణించిన ఎమ్మెల్యే సతీమణి పోటీలో ఉండటంతో తాము పోటీ చేయటం లేదన్న పవన్ ప్రకటనతో ఇప్పుడు టీడీపీ సైతం వెనక్కు తగ్గుతుందా అనే చర్చ మొదలైంది. అయితే, ఇప్పటికే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఓడిన ఓబులాపురం రాజశేఖర్ ను టీడీపీ బద్వేలు అభ్యర్దిగా ప్రకటించింది.

ఏకగ్రీవం కోరుతూనే..వైసీపీ మెజార్టీ లెక్కలు

ఏకగ్రీవం కోరుతూనే..వైసీపీ మెజార్టీ లెక్కలు

పవన్ తో తిరిగి దోస్తీ కోరుకుంటున్న టీడీపీ..పవన్ నిర్ణయాన్నే ఫాలో అవుతూ తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా.. లేక బీజేపీ బరిలో ఉంటున్న కారణంగా టీడీపీ సైతం తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటికే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సిట్టింగ్ సభ్యుడి మరణం..వారి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చిన ఈ సమయంలో ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. అయినా..వైసీపీ ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పుడు పవన్ ప్రకటనతో నిర్ణయాల మీద ప్రభావం చూపుతోంది. దీంతో.. బీజేపీ ఏం చేయబోతోంది... టీడీపీ అధినేత తన నిర్ణయానికే కట్టుబడి ఉంటారా..లేక సమీక్షించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+