పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక..!!

డిప్యూటీ సీఎం పవన్ తన నియోజకవర్గ మహిళలకు శ్రావణ కానుక అందించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కావటంతో శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. దాదాపు 10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ చేసారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ కానుక అందించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు.

 స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
స్థానిక ఎన్నికలు వరుసగా ఇలా, సీట్లు..పోటీ పై కొత్త ఫార్ములా - చంద్రబాబు నిర్దేశం..!!
pawan-kalyan-distributes-sravana-month-gifts-to-10-000-women-in-his-constituency-details-here

పది వేల మందికి పవన్ కానుక

పెద్ద సంఖ్యలో మహిళలు వేకువజాము నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. పార్టీ నేతలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ మరియు మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+