వారికి జనసేనట్రస్ట్ ద్వారా 50లక్షలు; పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం: ఉద్వేగంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జన సైన్యం లేకుంటే పవన్ కళ్యాణ్ లేడనీ, జనసేన పార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఇప్పటం గ్రామానికి 50 లక్షలు ఇస్తామని పవన్ ప్రకటన
సభ నిర్వహించుకోవడానికి ప్రాంగణాన్ని ఇచ్చిన ఇప్పటం గ్రామానికి జనసేన ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యక్తిగత విభేదాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అమరావతి, తాడేపల్లి మండలం ఇప్పటంలోని కొదమ సింహాల లాంటి కార్యకర్తలకు, వీరబొబ్బిలి వంటి మహిళలకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న వారికి, పొలంలో వేదిక ఇచ్చిన రైతు సోదరులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
నమస్కారాల సంస్కారం జనసేన సంస్కృతి
2008లో పార్టీ పెట్టినప్పటి నుండి వెన్నంటి ఉండి సేవలందించిన పార్టీ నేతలు పలువురి సేవలు మరచిపోలేనివని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల పట్ల, దేశ భక్తి పట్ల తనకు నాగబాబు అవగాహన కల్పించారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ నాగబాబు లా కళాశాలలో చదువుతున్న సమయంలో ఆయన తనకు ఇచ్చిన పుస్తకం ఎంతో ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కేటీఆర్, చంద్రబాబుతో సహా అన్ని పార్టీల నేతలకు నమస్కారాలు తెలిపిన పవన్ కళ్యాణ్ నమస్కారాల సంస్కారం జనసేన సంస్కృతి అంటూ వెల్లడించారు.
ఆరుగురితో మొదలైన జనసేన పార్టీ రెండు రాష్ట్రాల్లో విస్తరించింది
ఎంత సింధువు అయినా బిందువు తోనే మొదలవుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఒక పార్టీని నడపాలంటే వేలకోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలు ఉన్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.మంత్రి అవంతి శ్రీనివాస్ ను బంతితో, వెల్లంపల్లి శ్రీనివాస్ ను వెల్లుల్లిపాయతో పోల్చారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నడవాలంటే సైద్ధాంతిక బలం కావాలని ఆరుగురితో మొదలైన జనసేన పార్టీ రెండు రాష్ట్రాల్లో విస్తరించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా జనసేన ఎదుగుతోంది
126 మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రారంభమై ఐదు లక్షల కార్యకర్తలకు ఎదిగామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 26 శాతం ఓటు షేర్ కు జనసేన పార్టీ పెరిగిందని, రాష్ట్రంలో 1200 మందికి పైగా సర్పంచులను గెలిపించుకున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సత్తా చాటామని పేర్కొన్న ఆయన ప్రస్తుతం పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. 7 నుండి 27 శాతానికి ఎదిగిన జనసేన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎదగబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

ప్రతికూల పరిస్థితుల్లోనే నాయకత్వం బయటపడుతుంది
మనం చేసే ప్రతీ పనీ సభ్య సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యంగా పోరాటం చేయగలిగినప్పుడే నాయకత్వం అంటే ఏంటో బయట పడుతుందని పేర్కొన్నారు. గెలుపు ఓటములను తాము సమానంగా స్వీకరించామని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అవరోధాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించాలని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడే ప్రజానాయకుడు అవుతాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications