పవన్ కళ్యాణ్ కోసం అభిమాని సుదూర సైకిల్ యాత్ర
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సైకిల్ యాత్ర చేపట్టారు. అతను పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పవన్‌ను కలిసేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు.
కాగా, సినిమాల్లో టాప్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్ గత ఏడాది జనసేన పార్టీని స్థాపించి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీలకు మద్దతు పలికారు. ఆ పార్టీల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల పర్యటన
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలన్నారు.
రైతుల తరఫున నష్ట పరిహారం చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో డీ శ్రీనివాస్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నదని వారు చెప్పారు. ఎకరాకు 15వేల నుండి 20వేల వరకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications