మళ్లీ పవన్ ఫ్యాన్స్ ఓజీ రచ్చ-ఆ పాపులారిటీకి ఎంపీ బైరెడ్డి శబరి ఫిదా..!

ఏపీలో డిప్యూటీ సీఎం అయినా టాలీవుడ్ హీరో అయిన పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు ఆయన్ను అధికారిక కార్యక్రమాల్లో సైతం ఇబ్బంది పెడుతోంది. అయినా పవన్ మాత్రం చాలా సార్లు ఓపిగ్గా ఉంటూ ఫ్యాన్స్ అభిమానానికి ఫిదా అవుతూనే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వారిని సుతిమెత్తగా హెచ్చరిస్తుంటారు. ఇవాళ కర్నూలు జిల్లాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో మరోసారి పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ రచ్చ చేశారు.

ఇవాళ అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పూడిచర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడేందుకు సిద్దమవుతుండగా.. పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె కూడా పవన్ అభిమానుల్లో ఆయనకు ఉన్న అభిమానాన్ని అభినందించారు. పవన్ సార్ మీ ఫ్యాన్స్ మా మాట వినరు.. వారు మిమ్మల్ని చూసేందుకే ఇక్కడికి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో పవన్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని తెలిపారు. అయితే పవన్ కలగజేసుకుని వారు అభిమానులు కాదు దేశభక్తులంటూ వ్యాఖ్యానించారు. మీరు ప్రసంగం కొనసాగించాలని ఆమెకు సూచించారు.

pawan kalyan fans OG slogans at Kurnool mgnrega event mp byreddy shabari explained his craze

అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించేందుకు వచ్చిన సమయంలోనూ ఫ్యాన్స్ ఓజీ రచ్చ చేశారు. పవన్ ప్రసంగిస్తుండగా ఓజీ ఓజీ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దీంతో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడిన పవన్‌కల్యాణ్.. పల్లెలు, రోడ్లు, దేశం బాగుండాలనేదే తన ఆలోచన అన్నారు. కానీ మీరు ఓజీ ఓజీ అంటున్నారని, అభిమానుల శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+