ఈసారి ఎలాగైనా సీఎం ? పవన్ లెక్కలు పక్కా ! ఆ సమీకరణం తేల్చబోతోందా ?
ఏపీలో ఇన్నాళ్లూ రెండు కీలక సామాజిక పర్గాలకు మాత్రమే పరిమితమైన అధికార పీఠాన్ని అందుకునేందుకు మూడో సామాజిక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎప్పుడూ ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన నేతలు, అందునా, ఈ మధ్య వారి కుటుంబ సభ్యులకే అధికార పీఠాలు దక్కించుకునేలా వారు చేస్తున్న ప్రయత్నాలు మూడో సామాజిక వర్గాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి.
దీంతో ఈసారి ఎలాగైనా తమ నేత సీఎం కావాల్సిందేనని వారు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే దానికి అడ్డుపడే వారిని ఓడించేందుకు సిద్ధమవుతున్న పరిస్ధితి. దీంతో ఆ సామాజిక వర్గాన్ని బుజ్జగించేందుకు సీఎం పదవి ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్
ఏపీలో మారిన రాజకీయ పరిస్ధితులు పవన్ కళ్యాణ్ ను సీఎం జగన్ కు ప్రత్యామ్నాయ నేతగా తెరపైకి తెస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో చంద్రబాబు విఫలవుతుండటం పవన్ కళ్యాణ్ కు బాగా కలిసొస్తోంది. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జగన్ పై ప్రజావ్యతిరేకతను సొమ్ముచేసుకునేందుకు చంద్రబాబుకు అవకాశం దక్కకపోతే ప్రత్యామ్నాయంగా పవన్ ను సీఎం పదవి కోసం తెరపైకి తెస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో ప్రధాన విపక్షం టీడీపీ సైతం ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పవన్ రాజకీయంలో అనూహ్య పరిణితి కనిపిస్తోంది.

సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఫోకస్ ?
గతంలో 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ సీట్లు గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్.. దీనిపై ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్దితి వచ్చింది. అయితే దీన్నుంచి త్వరగానే కోలుకున్న పవన్... ఈసారి ఎలాగైనా జగన్ స్దానంలో సీఎం సీటులో కూర్చోవాలనే అంచనాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగానే రాష్ట్ర రాజకీయాల్లో తన డిమాండ్ ను అనూహ్యంగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు ప్రధాని మోడీ సైతం పవన్ ను పిలిపించుకుని మాట్లాడటమో, లేక ఆయన వద్దకే వెళ్లి మాట్లాడటమో చేస్తున్నారు. దీంతో జగన్ కు ప్రత్యామ్నాయంగా సీఎం పదవికి ప్రత్యామ్నాయ నేతగా పవన్ కు ఫోకస్ పెరుగుతోంది.

బీజేపీ, టీడీపీ నుంచి ఆఫర్లు ?
ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఆఫర్ చేసింది. తాజాగా పవన్ తో వరుసగా భేటీ అవుతున్న చంద్రబాబు సైతం పవన్ కు సీఎం పదవి షేరింగ్ చేసుకుందామన్న ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా జగన్ ను గద్దె దింపితే ఆ తర్వాత సీఎం పదవి అధిష్టించేందుకు పవన్ కు సహకరిస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా తక్కువసీట్లు కేటాయించినా అంతిమంగా షేరింగ్ పద్దతిలో సీఎం పదవి ఇస్తామని టీడీపీ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు బీజేపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి సీఎం పదవి ఆఫర్ పవన్ కళ్యాణ్ కు ఉన్నట్లు తేలిపోయింది.

పవన్ సీఎం కావాలంటే ?
ఇప్పుడున్న పరిస్దితుల్లో పవన్ ను సీఎంను చేసేందుకు ప్రత్యక్షంగా బీజేపీ, పరోక్షంగా టీడీపీ సిగ్నల్స్ ఇస్తున్నాయి. అలాగే పవన్ కూడా సీఎం పదవి తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. అటు పవన్ సొంత సామాజిక ర్గం కాపుల నుంచి కూడా ఈసారి కాపులకు సీఎం పదవి డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ను సీఎంగా పూర్తి స్ధాయిలో ఫోకస్ చేసేందుకు బీజేపీ ఇష్టపడుతున్నా ఆ పార్టీకి ఓటు బ్యాంక్ లేకపోవడం మైనస్. కానీ ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ పాక్షికంగా అయినా సీఎం పదవి ఆఫర్ చేసేందుకు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీవైపు పవన్ మొగ్గుచూపుతున్నారు. పవన్ కు సీఎం పదవి ఇస్తామన్న సంకేతం కాపుల్లోకి టీడీపీ పంపగలిగితే కచ్చితంగా విపక్ష కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమీకరణం ఆధారంగా చంద్రబాబు-పవన్ ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications