Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ గా రాబోతున్న దుర్గమ్మ చీర..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం పూజ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మకు సమర్పించిన పట్టు చీర తిరిగి ఆయన వద్దకే చేరబోతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెల 25న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ప్రచారం కోసం తాను తయారు చేయించుకున్న వారాహి వాహనానికి పూజల కోసం ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చారు. వాహన పూజకు ముందు ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి అమ్మవారికి ఓ పట్టు చీర సమర్పించారు. అనంతరం పూజలు చేసుకుని కిందకు వచ్చేశారు. కొండ దిగువన వారాహికి పూజ పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అమ్మవారికి సమర్పించిన చీరను వేలం వేసినప్పుడు దాన్ని జనసేన పార్టీ నేత గంటా స్వరూప దేవి కొనుగోలు చేశారు. చీర ఖరీదుకే దాన్ని కొనుగోలు చేసిన స్వరూప దాని వెనుక మరో ఉద్దేశం ఉందని చెప్పారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన చీరను కొనుగోలు చేసి తిరిగి ఆయనకే పంపబోతున్నట్లు స్వరూప వెల్లడించారు. అయితే దీని వెనుక సదుద్దశమే ఉందన్నారు.

pawan kalyan gifted saree to vijayawada kanaka durga to return to him-here is the reason

అమ్మవారిని తాకిన చీరను పవన్ కళ్యాణ్ కు ఇస్తే ఆయనకు విజయం వరిస్తుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు చీరను కొనుగోలు చేసిన జనసేన పార్టీ మహిళా నేత గంటా స్వరూప దేవి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే గంటా స్వరూప ఈ చీరను వేలంలో కొనుగోలు చేసి ఆయనకు పంపుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ వైపు నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏదేమైనా అమ్మవారిని తాకిన చీరను తీసుకోవడం ద్వారా తన విజయానికి పనికొస్తుందని పవన్ భావిస్తుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

pawan kalyan gifted saree to vijayawada kanaka durga to return to him-here is the reason
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+