పార్టీ నిర్మాణంలో పవన్ బిజీ, పార్టీపై 'ఇజం' బుక్(ఫోటో)

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంలో బిజీగా ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. రెండు రోజుల క్రితం పవన్ చేసిన ప్రసంగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.

కాగా, జనసేన పార్టీ ఐడియాలజీతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుస్తకం రాశారు. ఇజం (ఐఎస్ఎం) పేరుతో పవన్ కళ్యాణ్ పుస్తకం విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి రాశారు. దీనిని ఈ నెల 25వ తేదీన ఆవిష్కరించనున్నారని సమాచారం.

 Jana Sena

పుస్తకం కవర్ పేజీ పైన జనసేన పార్టీ గుర్తు ఉంది. ఈ పుస్తకాన్ని పవన్, రాజా రవితేజలు ఐదేళ్లుగా రాస్తున్నారని సమాచారం. ఇందులో పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కవర్ పేజీని మీడియాకు విడుదల చేశారు.

కాగా, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేన పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ తన రెండు గంటల ప్రసంగంలో కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబానికి చురకలు వేశారు. కాంగ్రెసును గెలవకుండా చేసేందుకు చంద్రబాబుతో సహా ఎవరినైనా కలిసేందుకు సిద్ధమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+