పవన్ కళ్యాణ్ కు నాలుగో పెళ్ళాం, చిరంజీవి అలా హ్యాపీ: పోసాని షాకింగ్ కామెంట్స్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన, టిడిపి అధినేత చంద్రబాబు పైన వైసిపి నేత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు నాలుగవ పెళ్ళాం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ లాంటి వ్యక్తుల వల్ల కాపుల ఆత్మగౌరవం పోతుందని చంద్రబాబు దగ్గర కాపుల ఆత్మాభిమానాన్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టాడని విమర్శించారు.
పవన్ కళ్యాణ్, చిరంజీవి లను టార్గెట్ చేసిన పోసాని
కాపులలో ఎవరు ముఖ్యమంత్రిగా పనికిరారని చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ సరెండర్ అయ్యారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్ కేస్ అని, రాజకీయాలలో రోజురోజుకీ పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు చిరంజీవి వల్ల కూడా ఏపీలో కాపులంతా ఇబ్బంది పడ్డారు అన్నారు. చిరంజీవి సైతం కాపుల మనోభావాలను పట్టించుకోలేదని, ప్రజారాజ్యం పార్టీ నీటి బుడగలాగా పేలి పోయిందని పోసాని కృష్ణమురళి అన్నారు.

చిరంజీవి కాంగ్రెస్ కు ప్రజారాజ్యం అమ్మేసుకున్నాడు
ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారు అని ఆరోపించారు . చిరంజీవి దెబ్బకు రాష్ట్రంలోని కాపులు ఆస్తిని కోల్పోయి రోడ్డున పడ్డారని, చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు మంత్రి పదవి తీసుకుని హ్యాపీగా ఉన్నారన్నారు.
పవన్ కు నలుగురు పెళ్ళాలు
పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఎలాంటి వాడో తాను పవన్ కళ్యాణ్ కు, చిరంజీవికి చెప్పానని, కానీ చెవిలో సీసం పోసుకున్న పవన్ కళ్యాణ్ తన మాట వినలేదు అన్నారు. పవన్ కు డబ్బు, అధికారమే కావాలని పేర్కొన్నారు. పవన్ సభలకు వచ్చిన ఎవరూ ఆయనకు ఓటేయరు అన్నారు.
జగన్ తో పాటు ఆర్జీవిని చంపే యత్నం
జగన్ ప్రజల మనిషి అని, జగన్ కు, పవన్ కు ఎంతో తేడా ఉందని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారు. ఎంతకైనా తెగించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తో పాటు ఆర్జీవిని చంపాలని ప్రయత్నించారని, సీఎం జగన్ పైకి రాయి విసిరించారని, అది కంటికి తగిలి ఉంటే ఆయన ప్రాణం పోయేదని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులను ఓడించాలనుకోవాలి కానీ చంపాలి అనుకోకూడదు అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications