పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో అంటున్న నాగబాబు ... మెగా బ్రదర్ ధీమా ఏంటో

Recommended Video

    పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు : నాగబాబు || Oneindia Telugu

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఎన్నికలతో అడుగుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు సోదరుడు పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ నాయకుల్లా కాకుండా మంచి విజన్ తో రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు. నాగబాబు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారతారని చాలా ధీమాతో ఉన్నారు. ఏపీలో ఊహించినదానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని ఫుల్ ధీమాతో ఉన్నారు.

    మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం అయినా అలోచించి తీసుకుంటారని మెగా బ్రదర్ అంటున్నారు. తమకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, వైసీపీ అధినేత జగన్ తో కాని ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అన్ని కులాలను కలుపుకుంటూ వెళుతున్నారని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. ఇక గతంలో జగన్ ను సీఎం కానివ్వను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించటంతో దానికి సమాధానం చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు .

    జగన్ ను సీఎం కానివ్వడు .. చంద్రబాబునూ సీఎం కానివ్వాడు .. పవన్ సీఎం అవుతారేమో అని ఆసక్తికర వ్యాఖ్య

    జగన్ ను సీఎం కానివ్వడు .. చంద్రబాబునూ సీఎం కానివ్వాడు .. పవన్ సీఎం అవుతారేమో అని ఆసక్తికర వ్యాఖ్య

    ‘కళ్యాణ్ బాబు జగన్ ను సీఎం కానివ్వడు. అలాగని చంద్రబాబునూ సీఎం కానివ్వడు' అని తేల్చిచెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే పవన్ కల్యాణే సీఎం అవుతాడేమో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక జనసేనపై మీడియా విషం చిమ్మిందని ,మీడియా చేసినంత దుర్మార్గం తమ జీవితాల్లో ఎవ్వరూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని జనసేనాను దెబ్బ కొట్టటానికి చేస్తున్న తప్పుడు పచారాలని నాగబాబు మండిపడ్డారు. జనసేనలో టికెట్లను అమ్ముకున్నారన్న ప్రచారం కేవలం మీడియా సృష్టి మాత్రమేనని నాగబాబు పేర్కొన్నారు .

    పవన్ కింగ్ మేకర్ అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలో తానే నిర్ణయిస్తాడు అన్న నాగబాబు

    పవన్ కింగ్ మేకర్ అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలో తానే నిర్ణయిస్తాడు అన్న నాగబాబు

    తాము ఎవ్వరికీ టికెట్లు అమ్ముకోలేదని చెప్పారు. అంత అవసరం కూడా తమపార్టీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన కింగ్ మేకర్ గా మారితే ఎవరికి మద్దతు ఇవ్వాలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాకే తాము తుది నిర్ణయం తీసుకుంటామని మెగా బ్రదర్ పేర్కొన్నారు. మొత్తం మీద మెగా బ్రదర్ నాగబాబు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+