Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పచ్చబొట్టు వేయించుకోమంటే అలజడి దేనికి? అంబటి రాంబాబు ఆలోచన ఎప్పుడూ వాటిపైనే: పవన్‌కళ్యాణ్‌ జనసేన

ఏది మాట్లాడినా మంత్రులు ఉలిక్కి పడుతున్నారని, మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేశారు నాదెండ్ల మనోహర్. పచ్చబొట్టు వేయించుకోమంటే అంబటి రాంబాబుకు అలజడి ఎందుకు అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. జనసేన పార్టీ కూడా ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా ముందుకు వెళుతూ అధికార వైసిపిని టార్గెట్ చేస్తుంది. తాజాగా జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తూ అధికార వైసిపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

స్టిక్కర్లు వేస్తే జనాలు మర్చిపోరనే భ్రమలో వైసీపీ

స్టిక్కర్లు వేస్తే జనాలు మర్చిపోరనే భ్రమలో వైసీపీ


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి స్టిక్కర్ల ఉద్యమం కొనసాగుతుందని, స్టిక్కర్లు వేస్తే జనాలు మరిచిపోరని అపోహలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్న ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు వైసిపిని ఇంటికి పంపడానికి ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఏది మాట్లాడినా మంత్రులు ఉలిక్కి పడుతున్నారని, మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేశారు నాదెండ్ల మనోహర్. పచ్చబొట్టు వేయించుకోమంటే వైసిపి మంత్రి అంబటి రాంబాబుకు అలజడి ఎందుకు అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

జగన్ మీద నమ్మకం ఉంటే పచ్చబొట్లు వేయించుకోండి

జగన్ మీద నమ్మకం ఉంటే పచ్చబొట్లు వేయించుకోండి


వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీని వదిలి పారిపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ఆలోచన ఎంతసేపు పవన్ కళ్యాణ్ పైన, వారాహి వాహనం పైనే ఉన్నాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి పట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీకు అంతగా జగన్ మీద నమ్మకం ఉంటే మీ చేతులపై పచ్చబొట్లు వేయించుకొని ప్రజల్లోకి వెళ్లాలని, మేము పార్టీ మారము.. జగనన్న మీద మాకు నమ్మకం ఉంది.. జగనన్నతోనే ఉంటామని ప్రజలకు చెప్పాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి స్టిక్కర్లా?

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి స్టిక్కర్లా?

స్టిక్కర్లు వేస్తూ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన గ్రామాల్లో కనీసం రోడ్లు వేయడం లేదని, మురుగునీరు కాలువలు శుభ్రం చేయడం లేదని, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసే వారే లేరని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి మోసం చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రులు రాజకీయ విమర్శలు మానుకొని మీ శాఖల గురించి మాట్లాడాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

అంబటి ఆలోచన అంతా పవన్ కళ్యాణ్ పైనే

అంబటి ఆలోచన అంతా పవన్ కళ్యాణ్ పైనే

అంబటి రాంబాబు పోలవరంపై మాట్లాడారని, నీటిపారుదల అంశాలపై చర్చించారని కాలువల ఆధునీకరణ గురించి అసలే చెప్పరని కేవలం వారాహి ఎప్పుడొస్తుంది? జనసేన పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటకు వస్తారు? అన్న ఆలోచనలోనే అంబటి రాంబాబు ఉన్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఈ ఆలోచనలు పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలని అంబటి రాంబాబుకు సూచించారు.

రైతులను కులాలుగా విడగొట్టారు అన్న నాదెండ్ల

రైతులను కులాలుగా విడగొట్టారు అన్న నాదెండ్ల

ఇక ఇదే సమయంలో వైసీపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న నాదెండ్ల మనోహర్ రైతులను కూడా కులాలుగా విడగొట్టారని సకాలంలో రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా చేయడం లేదని, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కంద్రం ఇస్తున్న రైతు భరోసా వ్యవహారంలో కూడా కులాల వారీగా విభజిస్తున్నారని, ఓసి రైతులకు ఇవ్వబోమని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ కులం వారైనా రైతులు రైతులేనని రైతులకు కులం, ప్రాంతం, రాష్ట్రమన్న తేడాలు ఉండవని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

స్టిక్కర్లు వేసే బదులు ఆ పనులు చెయ్యాలని సలహా

స్టిక్కర్లు వేసే బదులు ఆ పనులు చెయ్యాలని సలహా

తెనాలి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి అన్న నాదెండ్ల మనోహర్ స్టిక్కర్లు వేసే బదులు సమస్యల పరిష్కారానికి పనిచేస్తే మంచిదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలతో జనసేన దూసుకుపోతుందని పేర్కొన్న ఆయన ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+