AP Deputy CMO: ఇక ఏపీ డిప్యూటీ సీఎంవో..! సొంత ముద్ర కోసం పవన్ మరో అడుగు !
ఏపీలో గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. తోటి విపక్ష నేతగాఉన్న చంద్రబాబు స్కిల్ కేసులో జైలుకు వెళ్లడంతో ఆయనకు సంఘీభావం తెలిపి అక్కడికక్కడే టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీని కూడా పొత్తులోకి తెచ్చి కూటమి పేరుతో ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారిన పవన్ .. తన వద్దకు భారీగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్దమయ్యారు.
ఇందుకోసం ఇప్పటి వరకూ ఏపీ సీఎంవోకు మాత్రమే ఉన్న సోషల్ మీడియా హ్యండిల్స్ కు అదనంగా ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో హ్యాండిల్స్ ను ప్రారంభించారు. ఫేస్ బుక్, ఎక్స్, ఇన్ స్టాలో ఏపీ డిప్యూటీ సీఎంవో పేరుతో హ్యాండిల్స్ దర్శనమిస్తున్నాయి. జనసేన పార్టీ వీటిని తమ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసింది. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు, నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా వీటిని ఫాలో కావడం ప్రారంభించారు.

Hon'ble Deputy CM and Minister for Environment, Forest, and Science & Technology, Sri @PawanKalyan garu, met with members of the Andhra Pradesh Forest Officers Association (APFOA) today at the Secretariat. (1/2) pic.twitter.com/blaEUhwyMo
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) July 31, 2024
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో నిత్యం తాను చేస్తున్న కార్యక్రమాలు, సమీక్షలు, అధికారిక భేటీలకు సంబంధించిన సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఈ హ్యాండిల్స్ లో షేర్ చేస్తున్నారు. తద్వారా సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేక హ్యాండిల్స్ ద్వారా ఈ వివరాల్ని ప్రజలతో పంచుకునేందుకు వీలు కలుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వంలో తనదైన శైలితో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కూడా సొంత ముద్ర వేసుకునేందుకు అవకాశం లభిస్తోంది.
-
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications