Kumki Elephants: కుమ్కీ ఏనుగుల కోసం బెంగళూరుకు పవన్! ఏంటీ వీటి ప్రత్యేకత?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ బెంగళూరులో పర్యటిస్తున్నారు. కర్నాటక పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఫలిస్తే మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతోపాటు జనానికి ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక తరహా కుమ్కీ ఏనుగులు అవసరమని అధికారులు పవన్ కు తెలిపారు.

pawan kalyan left to Bengaluru for bringing kumki elephants to control local menace

దీంతో ఈ ఏనుగుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పొరుగున ఉన్న కర్నాటకలో ఈ ఏనుగులు ఉన్నట్లు తెలుసుకుని వాటిని రాష్ట్రానికి కొన్ని ఇచ్చేలా మాట్లాడేందుకు పవన్ ఇవాళ బెంగళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో పవన్ చర్చలు జరపనున్నారు. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరడం ఈ రోజు చర్చల్లో ప్రధాన అంశంగా జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మన రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ ప్రయత్నాలు ఫలిస్తే కుమ్కీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి.

కుమ్కీ అనేది మన దేశంలో శిక్షణ పొందిన ఏనుగులకు ఉపయోగించే పదం. వీటిని అడవి ఏనుగులను ట్రాప్ చేయడానికి, కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి లేదా వైద్య చికిత్స అందించడానికి వాడతారు. కుమ్కీలను అడవి ఏనుగులను బంధించడం, శాంతపరచడం, మేపడం లేదా సంఘర్షణ పరిస్థితులలో అడవి ఏనుగులను దూరంగా నడిపించడం కోసం ఉపయోగిస్తారు. తద్వారా అవసరమైతే అవి అడవి ఏనుగులను బలవంతంగా నియంత్రించవచ్చు. అడవి ఏనుగులు మానవ స్థావరాలలోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమికొట్టడానికి కుమ్కీలను వాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+