కొత్త సమస్యతో బాధపడుతున్న మార్క్ శంకర్.. సైకాలజిస్ట్ తో ట్రీట్ మెంట్..?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్నా మార్క్ శంకర్ మానసిక స్థితి బాలేదని పవన్ తెలిపారు. అగ్ని ప్రమాదం తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదన్నారు. ఇప్పటికీ భయడపడుతున్నాడని పవన్ వెల్లడించారు.
మార్క్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయాల్లో నిద్రలో లేచి.. బిల్డింగ్ పైనుంచి పడిపోయినట్లు కలలు వస్తున్నాయని తెలిపారు. మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకియాట్రిస్ట్‌తో మెరుగైన చికిత్స చేయిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యాన్ని ప్రస్తావించారు. మధుసూదన్ కుటుంబం కూడా తన కుమారుడి లాగే ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిందని.. ఆ బుల్లెట్ సౌండ్స్, భయానక వాతావరణం కారణంగా వాళ్లకు ఆ షాక్ నుంచి తేరుకోవడం కష్టం అని అన్నారు. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు.
నా కొడుకు కి తట్టుకోలేక పిచ్చి కలలు వస్తుంటే సైకియాట్రిస్ట్ కి చూపిస్తున్నమ్.అలాంటిది మధు సుధన్ రావుగారు మరణం తమ పిల్లలు చూస్తుండగా జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమిటి.@PawanKalyan @JspBVMNaresh pic.twitter.com/nLhZpFy2lP
— uppalapati Ram varma (@uppaalapatiRam) April 29, 2025
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు.
అనంతరం పవన్ కల్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే మార్క్ శంకర్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు. శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతికి వచ్చి తలనీలాలు సమర్పించారు. ఈమేరకు టీటీడీ అన్నప్రసాదానికి రూ. 17 లక్షలు విరాళం కూడా ఇచ్చి ముక్కులు చెల్లించుకున్నారు.












Click it and Unblock the Notifications