రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన పవన్ కల్యాణ్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీపడటానికి, పార్టీని నడిపించడానికి అవసరమైన 'ముడిసరుకు' సినిమాల నుంచే వస్తోంది. పార్టీని నడిపించడానికి నగదు అవసరమవుతుండటంతో పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుదామన్నా ముందుకు సాగలేని స్థితి. అన్నింటికీ డబ్బులు అవసరమే. దీంతో ఒకవైపు పార్టీని నడుపుతూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. వీటిల్లో నటించడంద్వారా వచ్చే రెమ్యునరేషన్ ను ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు, పార్టీకి ఉపయోగిస్తున్నారు.

పదే పదే వాయిదా పడుతోంది
ఎప్పటినుంచో షూటింగ్ జరుపుకుంటున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ పదే పదే వాయిదా పడుతూ వస్తోంది. ఎలాగైనా ఈసారి దీన్ని పూర్తిచేయాలనే పట్టుదలకు పవన్ వచ్చారు. క్రిష దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటోంది. దీంతో పాటు మరో సినిమాను ఒప్పుకున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తిచేసి ఎన్నికలయ్యేంతవరకు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు.

ఈ సినిమాకు అనేక అవాంతరాలు
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు కరోనావల్ల అతి పెద్ద గ్యాప్ వచ్చిన ఈసినిమాకు పూర్తిస్థాయిలో షెడ్యూల్స్ కేటాయించారు. 2023 వేసవికి దీన్ని విడుదల చేయబోతున్నారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగివచ్చిన పవన్ కల్యాణ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోడీని కలిసిన వెంటనే తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన సుదీర్ఘమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు మందు వచ్చే ఈ ఫైట్ సీన్ సినిమాకు కీలకమని దర్శకుడు వెల్లడించారు.

రాజకీయాల్లో పాల్గొంటూనే పూర్తి?
రాజకీయాల్లో పాల్గొంటూనే హరిహర వీరమల్లు సినిమాను త్వరత్వరగా పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. దర్శకుడు క్రిష్ కూడా ప్రక్క ప్రణాళికతో కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకుని, నటులందరినీ అందుబాటులోకి తీసుకొని షూటింగ్ చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. రెండురోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సూపర్ స్టార్ కృష్ణ మరణంతో స్వచ్ఛందంగా రెండురోజులపాటు వాయిదా వేశారు. తాజాగా రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications