పవన్ కల్యాణ్ స్పీడ్ కు బ్రేకులు?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ప్రధానంగా ఓజీ పై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్‌తోనే ఈ సినిమా హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కల్యాణ్ ను సుజిత్ ఎలా చూపించబోతున్నాడో అనే ఎగ్జైట్ మెంట్ ను పవన్ అభిమానులే కాకుండా తెలుగు సినీ ప్రేమికులు కూడా వ్యక్తపరుస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమా ఓజీకన్నా ముందే ప్రారంభమైనప్పటికీ గ్యాంగ్ స్టర్ సినిమాలంటే ఆసక్తి చూపించే పవన్ కల్యాణ్ దాన్ని పక్కనపెట్టి మరీ దీనికి ఎక్కువ కాల్షీట్లు కేటాయించారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఎప్పుడు థియేటర్ లోకి ఈ సినిమా వస్తుందా? ఎప్పుడు తమ అభిమాన హీరో గ్యాంగ్ స్టర్ ఎలివేషన్స్ అనే ఆత్రుతో పవన్ అభిమానులున్నారు.

pawankalyanog

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవలే తన మొదటి విడత వారాహి యాత్రను పూర్తిచేశారు. త్వరలోనే రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓజీకి పవన్ డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో పవన్ కల్యాణ్ లేని సన్నివేశాలను పూర్తిచేయాలని సుజిత్ నిర్ణయించుకున్నారు. ఈనెల రెండోవారం నుంచి వీటిని చిత్రీకరించబోతున్నారు.

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పవన్ కల్యాణ్ తన స్పీడ్ ను పెంచారు. షూటింగ్ లో ఉన్న సినిమాలను త్వరత్వరగా పూర్తిచేసి అధిక సమయాన్ని రాజకీయాలకే వెచ్చించాలనుకుంటున్నారు. ప్రస్తుతం బ్రో సినిమా షూటింగ్ పూర్తిచేశారు. ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో, హరిహర వీరమల్లు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే పూర్తిచేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+