వారికి ప్రతి నెలా రూ. 5000.. ఇంటి వద్దకే.. పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 175 స్థానాల్లో.. 164 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51 వేల మెజారిటీతో విజయం సాధించారు. పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కల్యాణ్.
తనను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కల్యాణ్ అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పవన్. రూ.34 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు.
ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో మరో సంచలన పథకాన్ని అమలు చేయనున్నారు పవన్ కల్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు నేనున్నానని ఆదుకున్నారు. నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాక ఇంటి వద్దనే రూ. 5000 పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిగతా మొత్తాన్ని వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం 32 మంది అనాథ పిల్లలకు పవన్ కల్యాణ్ స్వయంగా సాయం అందించారు.

ఈమేరకు పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఈ సాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారం తన బాధ్యతని తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికీ రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 అందించారు.
నా జీతం... మీ జీవితం కోసం…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 9, 2025
• పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా వేతనం
• ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం... మిగిలిన వేతనం వారి బాగోగుల కోసం ఖర్చు
• ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు
• పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… pic.twitter.com/gcZUz2YZsc
శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి స్వయంగా అందించారు పవన్. మిగిలిన పది మందికి జిల్లా అధికారుల ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్టు ఈ మేరకు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అనాథ పిల్లలకు ఇంటికే వచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications