Pawan Kalyanకు ఆ ఉంగరం ప్రమాదం - జరిగేదిదే : వేణుస్వామి సంచలనం..!!
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ సంచలనంగా మారారు. ఇదే సమయంలో ఆయనకు సంబంధించిన వ్యవహారాల పైన ప్రముఖ జ్యోతిష పండితుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం నుంచి చేతికి ఒక ఉంగరంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఉంగరం పైనే వేణు స్వామి హెచ్చరికలు చేసారు. పవన్ కళ్యాణ్ ఉంగరం పైన ఇప్పటికే రకరకాల విశ్లేషణలు..అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా విశాఖలో చోటు చేసుకున్న పరిణామాల తరువాత వేణు స్వామి తన విశ్లేషణ చేసారు. పవన్ ను అలర్ట్ చేసారు.
పవన్ కల్యాణ్ చూపుడు వేలికి సర్పాకారం లో ఉన్న ఉంగరం అసలు మంచిది కాదని చెప్పారు. పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 2, 1971లో జన్మించారు. పవన్ జాతకం ప్రకారం ఉత్తరాషాడ నక్షత్రంగా పేర్కొన్నారు. మకర రాశిలో ఉందని, గురువు మీద శని దృష్టి ఉంది. చంద్రుడు - కుజుడుతో వచ్చే రాహువు కలిసి ఉన్నాడని వేణు స్వామి వివరించారు. జాతక రీత్యా..గ్రహాల గమనం చూసిన తరువాత పవన్ ఈ ఉంగరం ధరించటం ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయని.. కేసుల పాలయ్యే అవకాశం ఉందని అలర్ట్ చేసారు.

పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కోసం వెంటనే ఆ ఉంగరం తీసేయాలనేది వేణుస్వామి సూచనగా చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఘటన ద్వారా ఆయనకు తొలుత మైలేజ్ కనిపించినా..ఈ ఉంగరం ప్రభావంతో ఉద్రేకం పెరుగుతోందనేది స్పష్టమైందన్నారు. గతంలో ఒక ప్రముఖ సినీ రచయిత - దర్శకుడు సూచన మేరకు పవన్ ఈ ఉంగరం ధరించినట్లు ప్రచారం సాగింది. దీంతో..పవన్ కళ్యాణ్ ఇప్పుడు జ్యోతిష్కులు చెబుతున్న అంశాలను పరిగణలోకి తీసుకొని తన ఉంగరం పైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications