జగన్ లాగా మేము తప్పులు చెయ్యం, మేము మీకు న్యాయం చేస్తాం, పవన్ కల్యాణ్

అన్నమయ్య ప్రాజెక్టుతో సర్వం కోల్పోయిన వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధితులకు హామీ ఇచ్చారు. శుక్రవారం రైల్వే కోడూరు పర్యటన ముగించుకుని రాజంపేట మండలంలోని తులపుత్తూరు గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయిన వరద బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి వారి గోడు వినిపించుకున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగినా మా ప్రభుత్వంలో మీకు న్యాయం చేస్తామ బాధితులకు హామీ ఇచ్చారు.

Pawan Kalyan promised justice to the victims of the Annamayya project

మూడేళ్ల కిందట అన్నమయ్య డాం తెగిపోయి తీవ్ర స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, అయినా ఇంతవరకు అప్పటి జగన్ ప్రభుత్వం బాధితులకు పునరావాసం కల్పించలేదని బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పిదాలను తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, మరోసారి వరద గ్రామాల్లో ఆ కమిటీ పర్యటిస్తుందని, ఆసందర్భంలో ఈ కమిటీ ఎందుకు వచ్చి మీ సమస్యలు వివరించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితులకు చెప్పారు.

అన్నమయ్య డ్యాం తెగిపోవడంతో ఇంతకాలం ఇబ్బందులు పడిన బాదితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, గత వైసిపి ప్రభుత్వం లాగా మేము నిర్లక్ష్యంగా వ్యవహరించమని బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాజంపేట ఎమ్మెల్యే 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆ ప్రాంతంలోని ప్రజలు గ్రామ సభలో బహిరంగంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేశారు.

మీ ఎమ్మెల్యే తో పాటు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూముల వివరాలు బయటకు లాగుతామని, తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇదే గ్రామసభలో ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల వివరాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+