Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan : గోదావరి జిల్లాల మాస్టర్ ప్లాన్ ప్రకటించిన పవన్..

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. నిన్న కోనసీమ జిల్లాలో యాత్ర ముగించుకున్న పవన్.. ఇవాళ నరసాపురంలో ప్రవేశించారు. రెండు వారాలుగా కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సాగిన వారాహి యాత్రలో పలు సంచలన ప్రకటనలు,వ్యాఖ్యలు చేసిన పవన్.. ఇవాళ మరో సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో దీని వివరాలు వెల్లడించారు.

గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించిన పవన్.. తాము అధికారంలోకి వస్తే ఈ జిల్లాల్ని ఎలా అభివృద్ధి చేస్తామో ట్వీట్ లో వెల్లడించారు. ఇందులో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు, పంచారామాలకు నెలవైన గోదావరి జిల్లాల్ని ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని పవన్ తెలిపారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ మ్యాప్ ను కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇందులో కాకినాడ జిల్లా అన్నవరం నుంచి ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం వరకూ పలు పుణ్యక్షేత్రాలున్నాయి.

Pawan Kalyan promises to develop godavari districts as religious tourism circuit in master plan

అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయం నుంచి భీమవరం శ్రీ సోమేశ్వరాలయం వరకూ ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయని పవన్ తెలిపారు. వేదఘోషతో పరవశించే ఉభయ గోదావరి జిల్లాల్ని ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు.

శక్తి పీఠాలు కొలువైన పిఠాపురం, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, పాలకొల్లు, నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది, ర్యాలీ జగన్మోహిని స్వామి క్షేత్రం, అయినవిల్లి వినాయక ఆలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన వాడపల్లి, ద్వారకాతిరుమల క్షేత్రాలు, నరసాపురం శ్రీ ఎంటెరు మన్నారు స్వామి ఆలయం.. ఇలా ఒకటేమిటి ఎన్నో దివ్యక్షేత్రాలతో గోదావరి సీమ అలరారుతోందని పవన్ తెలిపారు.

620 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతీ పవిత్ర ఆలయాన్ని కలుపుతూ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఈ జిల్లాల్ని అభివృద్ధి చేయడం తక్షణ అవసరమని పవన్ తెలిపారు. ఈ విధంగా ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి మూలంగా ఇక్కడి సనాతన ధర్మ విశిష్టత నలు చెరగులా వ్యాప్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడమే జనసేన సంకల్పానికి ముఖ్య కారణమని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+