పవన్ కల్యాణ్ తాజా ప్రతిపాదన ఇదీ: తగ్గొద్దని బాబు ఆదేశం, కవితపై ఫైర్

Recommended Video

    Pawan Kalyan Has Proposed Fact Finding Committee

    అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన సహాయంపై బిజెపి ఎంపీ హరిబాబు వివరించగా, తనకు న్యాయం చేయాలని టిడిపి ఎంపీలు అరుణ్ జైట్లీని కలిశారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తదుపరి కార్యాచరణపై ఆయన దృష్టి పెట్టిన్లు కనిపిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసినప్పటికీ వేడి చల్లారినట్లు లేదు.

     నిజనిర్ధారణ కమిటీ వేయాలని పవన్

    నిజనిర్ధారణ కమిటీ వేయాలని పవన్

    విభజన హామీలపై సంయుక్త నిజనిర్ధారణ ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ట్వీట్టర్‌లో ఆయన ఈ మేరకు ఓ ప్రతిపాదన చేసారు. ఆర్థిక వేత్తలు, మాజీ ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్లలు, రాజకీయ నాయకులు ఇందులో ఉండాలని ఆయన అన్నారు. దాంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశాలపై విస్తృత చర్చను చేపట్టాలని ఆయన సూచించారు.

    చంద్రబాబు ఇలా చెప్పారు..

    చంద్రబాబు ఇలా చెప్పారు..

    కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై గానీ, ఇతర అంశాలపై బిజెపి నాయకులు తప్పుడు లెక్కలు చెప్తే తిప్పికొట్టాలని చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు, నాయకులకు సూచించారు. కేంద్రంలోని పరిణామాలను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. కేంద్రంలో కదలిక వచ్చినందున మార్చి 5వ తేదీ వరకు వేచి చూడాలనే వైఖరిని ఆయన తీసుకున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడ్ని ఢిల్లీకి పంపించాలని నిర్ణయించారు.

     జైట్లీతో సుజనా, రమేష్ భేటీ

    జైట్లీతో సుజనా, రమేష్ భేటీ

    కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ భేటీ అయ్యారు. శుక్రవారంనాటి సమావశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి చొరవ చూపాలని వారు జైట్లీని కోరారు. సోమవారంనాడు అధికారులతో చర్చించి ముందుకు సాగుదామని మంత్రి చెప్పారు.

    పవన్ కల్యాణ్ జెఎసికి సహకారం

    పవన్ కల్యాణ్ జెఎసికి సహకారం

    జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసే జెఎసికి సహరిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం చాలా తక్కువ నిధులు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెసు తరఫున చేపట్టబోయే ఆందోళనా కార్యక్రమాలను కూడా ఆయన ప్రకటించారు.

     కల్వకుంట్ల కవితపై విహెచ్ పైర్

    కల్వకుంట్ల కవితపై విహెచ్ పైర్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెసు నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన కవితకు తెలంగాణకు జరిగిన అన్యాయం కనిపించలేదా అని ఆయన అడిగారు.

     కెసిఆర్ సర్వనాశనం చేస్తున్నారని..

    కెసిఆర్ సర్వనాశనం చేస్తున్నారని..

    బయ్యారం ఉక్క కర్మాగారం, ఐఐఎం, హైకోర్టు విభజన కవితకు గుర్తుకు రాకపోవడం శోచనీమని విహెచ్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆయన శనివారం మీడియాతో అన్నారు. హైదరాబాదును కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+