Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హెల్త్ బులిటెన్ ఇచ్చిన చంద్రబాబు..! సర్జరీ తర్వాత..!

భుజం కండరాల నొప్పితో బాధపడుతూ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) మంత్రులతో కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్ నోవాతో పాటు డాక్టర్లను ఆయన ఆరోగ్యంపై ఆరా తీసారు. పవన్ కళ్యాణ్ తోనూ చంద్రబాబు మాట్లాడి ఆయన ఆరోగ్యంపై వాకబు చేసారు. అనంతరం ఆస్పత్రి నుంచి బయటికి వచ్చాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ఆయన ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తుంటారని, అలాగే ప్రజలను విశేషంగా ఆకర్షించే శక్తి ఆయనకు ఉందని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ఆయన తన గురించి తాను మర్చిపోతుంటారన్నారు. పవన్ కు శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆయన బాగా కోలుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని నమ్మకం ఉందన్నారు.

Pawan Kalyan Recovering Well After Surgery Needs 3 Weeks of Rest Chandrababu Naidu

అయితే పవన్ కళ్యాణ్ మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఆరు నెలల తర్వాత పరిస్థితిని సమీక్షించి, తదుపరి కార్యాచరణపై వారు సూచనలు చేస్తారని చంద్రబాబు మీడియాకు తెలిపారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై, మెరుగైన చికిత్సపై చంద్రబాబు ఆస్పత్రి వర్గాలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ ను చంద్రబాబు పరామర్శించిన సమయంలో ఆయనతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+