సీఎం పదవి అప్పుడే అడుగుతా-ముందు నన్ను గెలిపించండి- పవన్ వ్యాఖ్యలు..

ఏపీలో తాజా రాజకీయాలపై ఇవాళ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటాయని పదే పదే చెప్తున్న పవన్.. ఇవాళ మరోసారి అదే విషయాన్ని గుర్తుచేశారు. అలాగే తాను సీఎం పదవి తీసుకుంటేనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సొంత పార్టీతో పాటు కాపు నేతలు చేస్తున్న డిమాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ భవిష్యత్తు కోసం తాను పొత్తులకు వెళ్తున్నానని, సీఎం పదవి వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పొత్తులతోనే ముందుకెళ్తుందని, సీఎం ఎలా అవ్వాలా లేదా అనేది ఫలితాల తర్వాతే మాట్లాడతామన్నారు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ముఖ్యం కాదని, ఆరోజు బలాబలాల్ని బట్టి సమీక్ష చేసి నిర్ణయించవచ్చన్నారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని తొలగించడం, పోటీ చేసిన స్ధానాలన్నీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ముఖ్యమన్నారు.

Pawan Kalyan Comments On CM Post

ఎన్నికలు అయ్యేవరకూ తాను ఏ వ్యూహం వేసినా రాష్ట్రం కోసమేనన్నారు. సీఎం పదవి రావాలంటే ముందు ఓ సముచిత స్ధానంలో తనను గెలిపించి అడగాలన్నారు. భావోద్వేగాలతో కాకుండా ఆలోచనతో రాజకీయాలు చేయాలన్నారు. ఆవేశమే అనర్ధాలకు దారి తీస్తుందన్నారు. ఈ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కోరారు.

వైసీపీ మీద తనకు ద్వేషం లేదని, వారి రాజకీయాలపైనే అభ్యంతరం ఉందన్నారు. మీకు రోడ్లేయని వ్యక్తి, మహిళలకు రక్షణ కల్పించని వ్యక్తి, పోలవరం పూర్తి చేయని వ్యక్తి, ఉద్యోగులకు జీతాలివ్వలేని వ్యక్తి ఎవరో గుర్తించాలన్నారు. తనకు ఓ సినిమా ఆపేస్తే వచ్చే నష్టం తట్టుకుంటానని, భవన నిర్మాణ కార్మికులకు ఇసుక తీసేస్తే వచ్చే నష్టం భర్తీ చేయడం కష్టమన్నారు. మీ ప్రత్యర్ధిని మార్చేయాలని, వైసీపీయే ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధి అని పవన్ తెలిపారు. తాను ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోనని, తనను నమ్ముకున్న ప్రజలకు నష్టం చేస్తానంటే తాట తీస్తానన్నారు.

ప్రజల్లో పచ్చదనాన్ని కూల్చేశారని, దారిలో చెట్లూ కూల్చేశారని, ఏ కులానికి జగన్ న్యాయం చేశాడో చెప్పాలన్నారు. అందరికీ అన్యాయం చేసిన జగన్ ను అందరికీ ప్రత్యర్ధిగా ప్రకటించాలన్నారు. మనకు నచ్చని వ్యక్తి అధికారంలో ఉంటే, ద్రోహం చేస్తుంటే తీసేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అందరికీ ఉందన్నారు. జగన్ మామూలు వ్యక్తి కాదని, అడ్డగోలుగా డబ్బు సంపాదించి గుండాల్ని, అధికారుల్ని కొనేశాడన్నారు. జగన్ మరోసారి సీఎం అయితే ఏపీ కోలుకోదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+