వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు..! కేబినెట్లో అడిగితే చంద్రబాబూ, లోకేష్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్చించామని ఆయన వెల్లడించారు. అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వలేదన్నారు. సరైన ఉత్తర్వు పత్రాలను, జీతభత్యాలను లేకుండానే వారిని నియమించిందన్నారు. గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడ నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించిందని గుర్తుచేశారు.

తాను ఈ విషయంపై చర్చకు తీసుకురాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్..పరిశీలన చేసి వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక నియామకాలు జరగలేదని గుర్తించారన్నారు. వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం వారిని నిలువునా వంచించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాలంటీర్లను సేవ చేయడానికి తీసుకొని గౌరవ వేతనాల పేరుతో అనధికారిక చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోందన్నారు.

pawan kalyan reveals reason behind unable to continue volunteers slammed ysrcp regime mistake

పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి, పూర్తిగా వారు ఏ కోవలోకి చెందకుండా పని చేయించుకున్నారని పవన్ స్పష్టం చేశారు. అసలు జీతాలు ఎక్కడ నుంచి వచ్చాయో వాలంటీర్లు అంతా సంఘ నాయకులను ప్రశ్నించాలని, విచిత్రమైన అకౌంటింగ్ తో యువతను నిలువునా మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. యువత జీవితాలు బాగుండాలని కలలు కనే వ్యక్తినని, వాలంటీర్లను ఆదుకునే విషయంలో సరైన దారి వెతుకుతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

Take a Poll

అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు చెప్పిన సమస్యలు అసాంతం విన్నారు. వాటిని రాసుకున్నారు. అనంతరం సమస్యలపై అధికారులకు తగు సూచనలు చేసి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు యువత వాలంటీర్ల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందిస్తూ "వాలంటీర్ అనే పేరును వైసీపీ ప్రభుత్వం అతి తెలివితో పెట్టిందన్నారు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారు అని అర్థం అన్నారు. కానీ ప్రచారం మాత్రం ప్రభుత్వ ఉద్యోగమని మభ్యపెట్టి యువతను మోసం చేశారన్నారు. కనీసం వారికి ఎక్కడ నుంచి జీతాలు ఇచ్చారో కూడా ఆర్థిక శాఖ వద్ద నివేదిక లేదు. యువతను పూర్తిగా వంచించి వైసీపీ పబ్బం గడుపుకొందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+