విశాఖ జిల్లాలో నేటి నుంచి పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర
విశాఖపట్టణం:విశాఖ జిల్లాలో నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పున:ప్రారంభం కానుంది. బుధవారం ప్రారంభమై జూలై 8 వరకు జనసేన మలివిడత పోరాటయాత్ర కొనసాగనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
యాత్రకు బయలుదేరే ముందే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మేధావులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని తెలిసింది. ఆ తరువాత పోరాటయాత్ర జూలై 8 వరకు నిర్విరామంగా కొనసాగుతుందని చెబుతున్నారు. జూలై 10న జనసైనికులు కవాతు నిర్వహిస్తారు. విశాఖ పర్యటన అనంతరం విజయవాడ, హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని సమాచారం. జూలై 14 తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్ర కొనసాగుతుంది.

విజయనగరం జిల్లా పర్యటన తర్వాత కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న పవన్..బుధవారం నుంచి యాత్రలో పాల్గొంటున్నారు. జూన్ 25 న కొడుకు అకీరాతోపాటు విజయవాడలో విశాఖ బయలుదేరిన పవన్ మధ్యాహ్నానికి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అకీరాతో కలిసి పవన్ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications