వారికి షాకిచ్చేలా ముస్లిం రిజర్వేషన్ లపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం పైన దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ బీసీ లకు న్యాయం చేస్తామని బిజెపి ప్రధానంగా తమ ఎన్నికల ప్రచారంలో చెబుతోంది.
ముస్లిం రిజర్వేషన్ లపై జగన్ వ్యాఖ్యలు
దీంతో బీజేపీకి అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, ముస్లింలకు మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముస్లింల రిజర్వేషన్లపై ఎన్డీఏ కూటమి వైఖరిపై వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ముస్లిం రిజర్వేషన్ లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన చంద్రబాబు దీనిపై ఆయన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముస్లిం రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో దేశానికి మేలు జరగదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బిజెపి ముస్లింలకు వ్యతిరేకం కాదన్న పవన్ కళ్యాణ్
రిజర్వేషన్లు ఇచ్చే కంటే వారికి ఉపాధి కల్పించే అంశం పైన అన్ని పార్టీలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బిజెపి ముస్లింలకు వ్యతిరేకం కాదని ముస్లిం రిజర్వేషన్ల విషయంలో బిజెపి నేతలు చేసిన ప్రకటనల పట్ల తానేమి నిరాశ, ఆందోళన చెదడం లేదన్నారు.
రిజర్వేషన్ లకన్నా ఇది ముఖ్యం
రిజర్వేషన్ల అమలు కన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేల వివిధ అంశాలపైన శిక్షణ ఇవ్వడం మంచిదని ఆయన సూచించారు. రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించండి
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ లు ఇవ్వకూడదని స్పష్టంగా ఉందని, కేవలం రాజకీయ లబ్ది కోసం మతపరమైన రిజర్వేషన్ లను కొందరు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యం కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు గురించి ఆలోచించాలన్నారు. పవన్ కళ్యాణ్. మొత్తంగా బిజెపికి మద్దతు ఇస్తూనే, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రిజర్వేషన్ లపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications