పవన్ కళ్యాణ్ శ్రమదానం.. పబ్లిసిటీ స్టంట్ ; ఆయనో హాస్య నటుడు : ఏకిపారేసిన మంత్రులు కన్నబాబు, ధర్మాన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీజయంతి నాడు పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమం అనేక ఉద్రిక్తతల మధ్య సాగింది. రాజమండ్రిలో జనసేన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మరోమారు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బూతులు మాట్లాడుతూ రాజకీయాలు చేస్తే తొక్కి నార తీస్తాను అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై మరోమారు మాటల దాడికి దిగారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఈ తరహా శ్రమదానం పవన్ ఒక్కరే చెయ్యగలరేమో : మంత్రి కన్నబాబు
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ శ్రమదానం పేరుతో పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఈ తరహా శ్రమదానం పవన్ ఒక్కరే చేయగలరేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై యుద్ధం ప్రకటించానని పవన్ చెబుతున్నారని, అసలు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడానికి గల కారణాలు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు కన్నబాబు. పవన్ కళ్యాణ్ ఏ విషయంలో యుద్ధం చేస్తున్నారు అంటూ ప్రశ్నించిన ఆయన కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు యుద్ధం చేయాలా ? లేక ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినందుకు యుద్ధం చేయాలా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

రాజకీయాల్లో కుల అజెండా ప్రకటించినట్టు పవన్ వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదరికంపై యుద్ధం ప్రకటించారని, ప్రజలు సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారని పేర్కొన్న ఆయన, రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు అని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి రాజకీయాల్లో కులాన్ని ఎజెండాగా చేస్తున్నామని ప్రకటించినట్టు ఉందని మంత్రి కురసాల కన్నబాబు పవన్ వ్యాఖ్యలను టార్గెట్ చేశారు.

ఉగ్రవాదిలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ కు నమ్మకం లేదని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమం కోసం చూస్తే పవన్ కళ్యాణ్ కులాల కోసం చూస్తున్నారంటూ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. కుల రాజకీయం చేసిన వాళ్ళు ఎవరూ విజయం సాధించలేదంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదులు మాట్లాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు తోడు లేకుండా పవన్ కళ్యాణ్ రాజకీయం చేయలేరని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ గోతులు పూడ్చటం కాదు, గోతులు తీస్తున్నారంటూ కన్నబాబు మండిపడ్డారు. రోడ్ల మరమ్మతుల పేరుతో కుల రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కురసాల కన్నబాబు.

పవన్ కళ్యాణ్ హాస్యనటుడిలా తయారయ్యారు : ఏపీ డిప్యూటీ సీఎం
ఇదిలా ఉంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హాస్యనటుడిలా తయారయ్యాడని ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ చతురత లేదని,అనుభవం కూడా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో పరిణతి లేదని అభిప్రాయపడ్డారు. పవన్ ప్రభావం నామమాత్రపు ఓట్ల వరకే ఉంటుందని ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు.

రోజుకో పార్టీ తో పవన్ రకరకాల విన్యాసాలు
అసందర్భ ప్రేలాపనలు, అవసరం లేని వాగుడు పవన్ కు వెన్నతో పెట్టిన విద్య అంటూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నిప్పులు చెరిగారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ టిడిపికి ఓట్లు వేయించాడు అని మండిపడ్డారు. పవన్ వ్యవహారశైలిని ప్రజల హర్షించటం లేదని పేర్కొన్న ఆయన సినిమా ఇండస్ట్రీలోని పెద్దలే పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.పవన్ కళ్యాణ్ అవసరాలకు అనుకూలంగా మారిపోయే సైడ్ యాక్టర్ అంటూ పేర్కొన్నారు. రోజుకో పార్టీ తో పవన్ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు స్థిరత్వం లేదని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు.

పవన్ ను ఏకిపారేస్తున్న మంత్రులు .. రచ్చ కంటిన్యూ
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ మంత్రులు వరుస పెట్టి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమం సందర్భంగా, జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో ఆన్లైన్ టికెట్ల విక్రయాలపై మొదలైన రగడ నేటికీ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తుంది. రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ తీరును అప్పటినుంచి వైసీపీ మంత్రులు దుయ్యబడుతూనే ఉన్నారు. ఈ గందరగోళం కొనసాగుతుండగానే రోడ్ల మరమ్మతుల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో రచ్చ మరింత ముదిరింది. ఇక తాజా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమదైన శైలిలో వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమిని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పవన్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. పవన్ నటుడు కాబట్టే రాజకీయాల్లోనూ నటిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!











Click it and Unblock the Notifications