ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు - పవన్ కల్యాణ్..!!

ఏపీ ముఖ్యమంత్రికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసారు.

ముఖ్యమంత్రి జగన్ కు పవన్ కల్యాణ్ తన ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సెటైరికల్ గా ట్వీట్ చేసారు. ఏపీ ప్రభుత్వ అప్పుల గురించి పవన్ వ్యంగంగా ఈ ట్వీలో సీఎంను అభినందనలు తెలిపారు. అప్పు రత్న అంటూ పేరకొన్నారు. అందులో ముఖ్యమంత్రి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా కొంత కాలంగా విమర్శల వేడి పెంచిన పవన్..సోషల్ మీడియాలో ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ.. సీఎం జగన్ టార్గెట్ గా పవన్ తన అడుగులు వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు అంటూ పవన్ తన ట్వీట్ లో ముఖ్యమంత్రి పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జగన్ వర్సస్ పవన్ పొలిటికల్ వార్ పీక్ కు చేరింది. ముఖ్యమంత్రి ఎక్కడా ఏ సభలోనూ పవన్ పేరు ప్రస్తావించరు. చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా పవన్ ను టార్గెట్ చేసారు. పవన్ కల్యాణ్ వరుసగా సీఎంను టార్గెట్ చేస్తూ తన ప్రసంగాలు.. ట్వీట్లు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో.. అప్పురత్న
రాష్ట్ర సంపద..భవిష్యత్ గాలికి వదిలేసి మీ సంపాదన పెంచుకోండి..అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు మీకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు..అంటూ పేర్కొన్నారు. 9 నెలల్లో 55,555 కోట్ల అప్పు చేసినట్లు పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తాము గత ప్రభుత్వం కంటే తక్కువగానే అప్పులు చేస్తున్నామని..అంత కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తున్నామని చెబుతోంది. ఇదే సమయంలో పవన్ ఇప్పుడు ఏపీ అప్పుల గురించి ప్రస్తావించారు.

Pawan Kalyan special wishes to CM Jagan- tweets sattirically over AP debts

ఏపీ ప్రభుత్వం గత తొమ్మది నెలల కాలంలో చేసిన అప్పుల లెక్కల పైన పవన్ ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. అప్పు రత్న అవార్డు ముఖ్యమంత్రి పేరుతో సిద్దం చేసినట్లుగా ఒక కార్టూన్ ను తన ట్వీట్ లో జోడించారు. భారతరత్న తరహాలోనే అప్పు రత్న అవార్డు అంటూ వ్యంగాస్త్రం సంధించారు. జనసైనికులు ప్రస్తుతం ఈ ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పైనా గతంలోనూ టీడీపీ..జనసేన అప్పుల అంశం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఆ తరువాత అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ఏపీ అప్పుల గురించి ఈ మూడున్నారేళ్ల కాలంలో చేసిన వివరాలను వెల్లడించారు. ఇప్పుడు ఆర్దిక సంవత్సరం ముగుస్తున్న వేళ..మరోసారి ఏపీ అప్పుల అంశం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. పవన్ ట్వీట్ పైన వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+