Pawan Kalyan : యాప్స్ ఛాయిస్-టీచర్స్ మస్ట్-బైజూస్ పేరుతో వైసీపీని టార్గెట్ చేసిన పవన్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కొంతకాలంగా వాలంటీర్ల పేరుతో టార్గెట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విద్యారంగంలో లోపాల పేరుతో లక్ష్యంగా చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న బైజూస్ కంటెంట్, విద్యాసంస్కరణల్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇవాళ ట్వీట్ చేశారు. అందులో పాఠశాలలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఇవీ అంటూ ప్రస్తావించారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ల రిక్రూట్ మెంట్ లేదని, టీచర్లకు శిక్షణ కూడా లేదని, కానీ నష్టాల్లో ఉన్న స్టార్టప్ బైజూస్ కు మాత్రం ప్రభుత్వ ఒప్పందం దక్కడాన్న పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ అమలు చేస్తుందా లేదా అని అడిగారు. టెండర్ కు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ప్రశ్నించారు. ఇందులో ఎన్ని షార్ట్ లిస్ట్ చేశారని అడిగారు. ఇదంతా ప్రజా బాహుళ్యంలో ఉంచారా అని కూడా పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై స్పందించాలన్నారు.

ఈ ట్వీట్ కింద ట్యాబ్స్ పంపిణీ మంచిదేనని, కానీ ముందు పాఠశాలల్లో టాయిలెట్లు నిర్మించాలన్నారు. అలాగే యాప్స్ ఛాయిస్ అని కానీ టీచర్లు తప్పనిసరి అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ కు పలు మీడియా క్లిప్స్ ను కూడా జత చేశారు. వీటిలో స్టార్టప్ కంపెనీ బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందనే కథనం ఉంది. అలాగే బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఎంత చెల్లించిందనే వివరాలు కూడా ఉన్నాయి.
No Mega DSC Notification, No Teacher Recruitment, No Teacher Training. But, a loss making startup gets crores of contract. Has YCP Govt followed Standard Protocol? How many companies applied for the tender, who were shortlisted? Is it in Public Domain? YCP GOVT RESPOND!… pic.twitter.com/DAySn82x62
— Pawan Kalyan (@PawanKalyan) July 22, 2023
ఇప్పటికే వాలంటీర్ల వివాదంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరువునష్టం దావా వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మరో వ్యవస్ధ విద్యారంగంపైనా పవన్ చేసిన విమర్శలపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. అధికారులతో దీనిపై వివరణ ఇప్పిస్తుందా లేక వైసీపీ నేతలే రంగంలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications