జగన్ విన్నింగ్ ఫార్ములానే పవన్ అస్త్రం- అక్కడే ట్విస్టు : గోదావరి జిల్లాలే టార్గెట్ : ఎత్తులు-కొత్త పొత్తులు

వైసీపీతో కొద్ది రోజులుగా సవాళ్లు..ఛాలెంజ్ లతో హోరెత్తిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త యాక్షన్ ప్లాన్ తో సిద్దం అవతుున్నారు. పదే పదే వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం..అధికారంలోకి తీసుకొస్తామని చెప్పటం వెనుక పవన్ భారీ అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకున్నా...ఫెద్దగా నష్టపోయేది ఏమీ లేదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..సారి పూర్తిగా 2019 లో అధికారంలోకి వచ్చేందుకు జగన్ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ పైనే పవన్ ఇప్పుడు సైతం ఫోకస్ పెట్టారు.

జగన్ ఫార్ములా సక్సెస్

జగన్ ఫార్ములా సక్సెస్

జగన్ అధికారంలోకి వచ్చేందుకు 2019 ఎన్నికల సమయంలో అమలు చేసిన సామాజిక బ్యాలెన్సింగ్ విజయానికి దోహదం చేసింది. ఏ రకంగా అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే దాని పైన జిల్లాల వారీగా లెక్కలు సిద్దం చేసుకొని..టిక్కెట్లు కేటాయించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం పదవుల నుంచి..కేబినెట్ కూర్పు - నామినేటెడ్ పదవులు- స్థానిక సంస్థల్లో ఛైర్మన్ సీట్ల వరకు సామాజిక సమతుల్యత పాటించారు. టీడీపీ అండగా నిలిచిన బీసీ వర్గాలను అధిక శాతం తన వైపు తిప్పుకోవటంలో జగన్ సక్సెస్ అయ్యారు.

సోషల్ ఇంజనీరింగ్ లో పక్కా వ్యూహాత్మకంగా

సోషల్ ఇంజనీరింగ్ లో పక్కా వ్యూహాత్మకంగా

కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉండే ఎస్సీ ఓట్లు మొత్తం జగన్ కు టర్న్ అయ్యాయి. మైనార్టీ ఓట్ బ్యాంకు వైసీపీ వైపే నిలిచింది. అయితే, గోదావరి జిల్లాల్లో కాపు -బీసీ- ఎస్సీ-క్షత్రియ వర్గాల్లో మద్దతు సాధించే క్రమంలో జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక సీట్లు సాధించారు. మొత్తంగా 151 సీట్లు రావటానికి ఈ సామాజిక సమీకరణాలు దోహదం చేసాయి. అదే విధంగా చంద్రబాబు విశ్వసనీయత మీద జగన్ దెబ్బ కొట్టారు. ఇక, ఇప్పుడు పవన్ సైతం జగన్ బాటలోనే పయణించాలని భావిస్తున్నారు.

గోదావరి జిల్లాల పైనే పవన్ ఫోకస్

గోదావరి జిల్లాల పైనే పవన్ ఫోకస్

తాజాగా రాజమండ్రిలో ఆయన చేసిన ప్రసంగం అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాపు ఓటింగ్ గత ఎన్నికల్లో తమకు రాలేదని..జనసేన నేతలు పలు సందర్బాల్లో చెబుతూ వచ్చారు. అయితే, ఇప్పుటి వరకు కులాల ప్రస్తావనలో దూరం పాటించిన పవన్ రూటు మార్చారు. ఏపీలో సామాజిక సమీకరణాలే రాజకీయ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని గ్రహించి.. కొత్త నినాదం తెర మీదకు తెచ్చారు. కాపు-బలిజ-ఒంటరి -తెలగ కులాలు పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీసీ-ఎస్సీ వర్గాలను కలుపుకుపోవాలని సూచించారు.

పెద్దన్న పాత్ర పోషించాలంటూ పిలుపు..

పెద్దన్న పాత్ర పోషించాలంటూ పిలుపు..

దీంతోనే రాజ్యాధికారం సాధ్యం అవుతుందని విశ్లేషించారు. అదే సమయంలో కమ్మ వర్గం పైన వైసీపీ వ్యతిరేకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేసారు. రెడ్డి వర్గంలోనూ వైసీపీ ప్రభుత్వం పైన సంతోషంగా లేరని వివరించారు. అయితే, దాదాపుగా ఇదే కాంబినేషన్ తో ప్రజారాజ్యం సైతం ముందుకు వచ్చింది. కానీ, నాటి రాజకీయ పరిస్థితుల్లో వర్కవుట్ కాలేదు. తిరిగి ఇప్పుడు పవన్ గోదావరి జిల్లాల్లోని కాపు-బీసీ-ఎస్సీ ఓట్ బ్యాంకు పైన ఫోకస్ పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, సామాజిక సమీకరణాల బ్యాలెన్స్ 2019 లో జగన్ కు కలిసి వచ్చింది.

జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా..

జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా..

ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. పవన్ -చంద్రబాబు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీజేపీతో దూరం అవ్వటానికి పవన్ డిసైడ్ అయినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. అధికారంలో ఉన్న జగన్ వీటిని అంచనా వేస్తూ..తనకు అనుకూలంగా మలచుకోవటంలో ఇతరుల కంటే ఎక్కువగా అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే పై చేయి సాధించిన జగన్..ఇంకా రెండేళ్ల అధికారంలో ఏ వర్గాన్ని దూరం చేసుకోకుండా కొత్త వ్యూహాలు అమలు చేసే వెసులుబాటు ఉంది.

ఆ రెండు జిల్లాలపైనే అందరి ఫోకస్..

ఆ రెండు జిల్లాలపైనే అందరి ఫోకస్..

అదే సమయం లో కులాలకు అతీతంగా తాము అమలు చేస్తున్న సంక్షే పధకాలతో లబ్దిదారులు తమను మర్చిపోరంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే వర్గాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది. పవన్ వ్యూహం - భవిష్యత్ పొత్తులు ఏంటనేది తమకు క్లారిటీ వచ్చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..తిరిగి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్న జగన్ రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+