ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కారణం అదే..! తేల్చేసిన పవన్ కళ్యాణ్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల విరామం తర్వాత బీజేపీ సాధించిన ఘన విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న పవన్.. ఇవాళ వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన.. కాషాయ పార్టీ సాధించిన విజయానికి గల కారణాలను వెల్లడించారు.
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల్లో విశ్వాసం ఢిల్లీ ఎన్నికల ఫలితాతో మరోమారు రుజువైందని పవన్ కళ్యాణ్ తెలిపారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారన్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారన్నారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం అన్నారు.

ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం అని పవన్ తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయన్నారు. ఢిల్లీ అభివృద్ధికీ, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయన్నారు.
ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారని పవన్ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకున్నారని, ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన మోడీ, షా, నడ్డాకు మిత్ర పక్ష నాయకులకు పవన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications