వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"అన్నయ్య" బాట‌లోనే "త‌మ్ముడు" : ప‌వ‌న్ రెండు స్థానాలు ఖ‌రారు: నాగ‌బాబు కోస‌మేనా అక్క‌డ పోటీ..!

|
Google Oneindia TeluguNews

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్న‌య్య చిరంజీవి త‌ర‌హాలోనే రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యిం చారు. ఉత్త‌రాంధ్ర నుండి ఒక స్థానం..రాయ‌ల‌సీమ నుండి మ‌రో స్థానం ఇందు కోసం ఎంచుకున్నారు. ఉత్త‌రాంధ్ర నుండి గాజువాక‌.. గోదావ‌రి జిల్లాల్లోని భీమ‌వ‌రం నుండి ప‌వ‌న్ పోటీ చేయాల‌ని నిర్ణయించారు. జ‌న‌సేనాని తాజా నిర్ణ‌యం తో ఒక్క‌సారిగా ఎన్నిక‌ల రాజ‌కీయం వేడెక్కింది. ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌భావం ఏ విధంగా ఉంటుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

గాజువాక నుండి బ‌రిలోకి..

విశాక జిల్లా గాజువాక నుండి బ‌రిలోకి దిగాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ నిర్ణ‌యించారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారా జ్యం అధినేత గా చిరంజీవి రెండు స్థానాల్లో పోటీ చేసారు. వారి సొంత ప్రాంతం అయిన పాలకొల్లు అదే విధంగా తిరుప తి నుండి పోటీలో నిలిచారు. పాలకొల్లులో ఓట‌మి చ‌వి చూసిన చిరంజీవి తిరుప‌తి లో మాత్రం భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి పై విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు పవ‌న్ సైతం గాజువాక ను ఎంచుకున్నారు. ఇక్క‌డ టిడిపి నుండి ప‌ల్లా శ్రీనివా స రావు పోటీ లో ఉండ‌గా..వైసిపి నుండి తిప్ప‌ల నాగిరెడ్డి బ‌రిలో ఉన్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా పోటీ చేసిన వెంక‌ట్రామ‌య్య గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి ప‌ల్లా శ్రీనివాస్ 21712 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ ఇక్క‌డి నుండి పోటీ చేస్తుండ‌టంతో త్రిముఖ పోటీ నెల‌కొని ఉంది. అయితే ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఖచ్చితంగా గెలుస్తార‌ని ప‌వ‌న్ అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

భీమ‌వ‌రం నుండి సై ..

భీమ‌వ‌రం నుండి సై ..

రెండో స్థానంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమవ‌రం నుండి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించారు. ఉభ‌య గోదావ‌రి జిల్లా ల్లో సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా అక్క‌డ జ‌న‌సేన కు అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని చెబుతున్నారు. దీంతో..ఆ ప్రాంతంలో పోటీ చేస్తే రెండు జిల్లాల్లోనూ ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం లో కాపులు - క్ష‌త్రియ వ‌ర్గాల‌కు చెందిన నేత‌లే ఎమ్మెల్యేలు అవుతూ వ‌స్తున్నారు. 2009 లో కాంగ్రెస్ నుండి..2014 లో టిడిపి నుండి పోటీ చేసిన రామాజంనేయులు ఇక్క‌డ గెలుపొందారు. టిడిపి నుండి తిరిగి ఆయ‌నే అభ్య‌ర్దిగా టిడిపి ఖ‌రారు చేసింది. ఇక‌, వైసిపి నుండి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన గ్రంధి శ్రీనివాస్ ను తిరిగి వైసిపి అభ్య‌ర్దిగా ఇక్క‌డి నుండి ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్పుడు ప‌వ‌న్ రంగ ప్ర‌వేశం తో ఇక్క‌డ త్రిముఖ పోటీ నెలకొని ఉంది. టిడిపి అభ్య‌ర్ది రామాంజ‌నేయులు మంత్రి గంటాకు బంధువు.

జ‌న‌సేన పార్టీః మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!జ‌న‌సేన పార్టీః మ‌రో 32 మంది అభ్య‌ర్థుల జాబితా వెల్ల‌డి..అయిదు లోక్ స‌భ స్థానాలు కూడా!

నాగ‌బాబు కోస‌మేనా...

నాగ‌బాబు కోస‌మేనా...

ప‌వ‌న్ క‌ళ్యాన్ చిన్న అన్న‌య్య నాగ‌బాబు న‌ర్సాపురం నుండి ఎంపి గా బ‌రిలోకి దిగుతార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోనే భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉంది. తాను ఎమ్మెల్యేగా దిగ‌టం..నాగ‌బాబు ఎంపీగా బరిలో ఉండ‌టం ద్వారా ఖ‌చ్చితంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప్ర‌భావితం చేయ‌టంతో పాటుగా ఇక్క‌డ ఒన్ సైడ్ వార్ జ‌రుగు తుంద‌ని జ‌న సైనికులు చెబుతున్నారు. ఉభ‌య గోదావ‌రి లో ఇప్ప‌టికే ఉన్న ఇమేజ్ ను ఓట్లుగా మ‌ల‌చుకుంటూ ఆ జిల్లాల్లో మ‌రిన్ని సీట్లు సాధించ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ వ్యూహాలు అమ‌లు చేస్తున్న‌ట్లు అర్దం అవుతోంది. నాగ‌బాబు పోటీ పైనా ఈ సాయంత్రం లేదా రేపు ఉద‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాన్ పోటీ చేసే స్థానాలు ఖ‌రారు కావ టంతో..ఇక ప‌వ‌న్ సైతం ఎన్నిక‌ల ప్ర‌చారం లోకి దిగి మ‌రింత రాజ‌కీయ వేడిని పెంచ‌నున్నారు. మ‌రి..ఈ రెండు స్థానా ల్లో పోటీ చేస్తున్న ప‌వ‌న్ చివ‌ర‌కు ఏ స్థానం నిల‌బెట్టుకుంటారో చూడాలి. దీని పైనా ఇత‌ర పార్టీలు ప్ర‌చారం చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల 22న ప‌వ‌న్ నామినేష‌న్లు దాఖ‌లు చేస్తార‌ని తెలుస్తోంది.

English summary
janasena Chief Pawan Klayna decided to contest form Two assembly segemnts. One form North coastal another form Godavari region. He selected Gajuwaka and Bhimavaram segments. Pawan filing nominations on 22nd of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X